Begin typing your search above and press return to search.
పసుపులో కాకలు పుట్టిస్తున్న కియరా
By: Tupaki Desk | 29 April 2022 3:30 AM GMTనేటి జనరేషన్ నాయికలలో కియారా అద్వానీ అత్యంత ప్రజాదరణ పొందుతున్న భామగా వెలుగొందుతున్నారు. 2016 చిత్రం MS ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ తో తెరంగేట్రం చేసినప్పటి నుండి కియారా లైమ్ లైట్ లో తనని తాను నిరూపించుకుంటూ నటిగా కెరీర్ పరంగా ఎంతో ఎదిగింది. కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. కియరా ఇటీవల అసాధారణంగా అభిమానుల సంఖ్యను పెంచుకోవడంలో విజయం సాధించింది. సామాజిక మాధ్యమాలలో అసాధారణ ఫాలోయింగ్ ని కలిగి ఉంది.
ప్రస్తుతం కియారా తన తదుపరి చిత్రం భూల్ భూలయ్యా 2 ప్రమోషన్ లో బిజీగా ఉంది. అక్కడ ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది. విడుదల ముంగిట కియారా - కార్తీక్ సినిమా విడుదలను తీవ్రంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజు కియరా తన స్టైలిష్ రూపాన్ని ప్రదర్శించే ఫోటోషూట్ ని పంచుకుంది.
తన ఇన్ స్టాగ్రామ్ లో కియారా కొన్ని చిత్రాలను పంచుకుంది. అందులో థై స్లిట్ లుక్ లో కనిపించింది. తన అందాన్ని పదింతలు చేసేలాఆఫ్-షోల్డర్ పసుపు గౌనును ధరించింది. మేకప్ తో ఎర్రబడిన బుగ్గలు .. మెరుస్తున్న పెదవులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. కియరా ఇలా పసుపు డిజైనర్ దుస్తుల్లో కెమెరా ముందు అనేక ఆకర్షణీయమైన భంగిమలతో మైమరిపించింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ కియారా పోస్ట్ కి అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది. ``ఇది ప్రకాశవంతంగా మెరిసే రోజు`` అంటూ వ్యాఖ్యను జోడించింది.
అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భూలయ్యా 2 ఈ ఏడాది మే 20న విడుదల కానుంది. కియరా మాట్లాడుతూ.. భూల్ భూలయ్యా నా కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది నా మొదటి హారర్-కామెడీ.. కాబట్టి ఈసారి నేను కూడా ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నేను సబ్జెక్ట్ ని కొత్త మార్గంలో ట్రీట్ చేసాను. అసలైన కామెడీతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇది. మొదటి భాగాన్ని ప్రజలకు కనెక్ట్ చేయడమే సవాల్.. ఇంకా ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడంపైనా మా దర్శకుడు బాగా వర్క్ చేసారని తెలిపారు.
కియరా జగ్ జగ్ జియో చిత్రంలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో ఆర్.సి 15 ఆఫర్ కూడా తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. 2022 తనకు మెమరబుల్ ఇయర్ కానుంది.