Begin typing your search above and press return to search.
పెళ్లికి ముందు ఈ కవ్వింత ఏమిటో కియరా
By: Tupaki Desk | 26 Dec 2022 1:04 PM GMTవోర చూపులతో వలపు దోపిడీ చేస్తోంది. పిక్కల పైకి పొట్టి గౌనులో కవ్వించి చంపుతోంది. టైట్ ఫిట్ లో థై సొగసులను ఆవిష్కరించింది. ఏది ఏం చేసినా బోయ్స్ గుండెల్లో డేంజర్ అలార్మ్ మోగించిందన్నది నిజం. ఇంతకీ ఎవరీ బ్యూటీ అంటే..? కియరా అద్వాణీ. 5.5 హైటున్న ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ వెబ్ లో ప్రకంపనాలు రేపుతోంది. పింక్ ఫ్రాక్ లో టైట్ ఫిట్ లుక్ లో కియరా టూ హాట్ గా కనిపిస్తోంది. అయిలీ మేకప్ తో ఎలివేషన్ మరో లెవల్ అని చెప్పాలి.
తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న కియారా అద్వానీ డిజైనర్ లుక్ తో ఆకట్టుకుంది. అంతేకాదు ఈ షోలో చాలా విషయాలను కియరా ముచ్చటించింది. నిజానికి తాను నటి ఎలా అయిందో.. బాలీవుడ్ లో ఎలా చేరిందో వెల్లడించింది. చిత్రపరిశ్రమ నాకు సేఫ్ ప్లేస్ అవుతుందా లేదా? అని మొదట్లో నాన్న గారు చాలా ఆందోళన చెందారని కూడా కియరా తెలిపింది.
ది కపిల్ శర్మ షో తాజా ఎపిసోడ్ లో `గోవింద నామ్ మేరా` బృందం సందడి చేసింది. కియారా అద్వానీ- విక్కీ కౌశల్ తమ కొత్త సినిమా గురించి చాలా సంగతులను వెల్లడించారు. ఎపిసోడ్ హోస్ట్ కపిల్ శర్మ చిరునవ్వులు చిందిస్తూ ఈ జంటను షోకి ఆహ్వానించాడు. అలాగే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. `గోవింద నామ్ మేరా` బృందాన్ని టీవీక్షకులకు పరిచయం చేశాడు. కియారా అద్వానీ - విక్కీ కౌశల్ స్టైలిష్ గా వేదికపైకి వచ్చి తమ కొత్త సినిమా గురించి ముచ్చటించారు.
కపిల్ తన పంచ్ లైన్లు వ్యంగ్యమైన జోకులతో అందరినీ అలరించాడు. తర్వాత కియారా సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో ప్రశ్నించాడు. తాను సినీపరిశ్రమ వ్యక్తిని కానని బాలీవుడ్ లో ప్రవేశించడం తనకు కష్టమని భావించానని కియారా వెల్లడించింది. పరిశ్రమ తనకు సురక్షితమైన ఎంపికగా ఉంటుందా లేదా? అని తన తండ్రి ఆందోళన చెందారని ..అయితే ఐకానిక్ మూవీ `3 ఇడియట్స్` చూసిన తర్వాత తాను నటిగా మారడానికి అంగీకరించారని తెలిపింది.
ఇదే షోలో విక్కీ- కత్రినాల పెళ్లి గురించి కపిల్ వివరాలు అడగడమే గాక.. కత్రిన సోదరీమణులు భారతీయ ఆచారాలను అనుసరిస్తారా? అని ప్రశ్నించాడు. విక్కీ దానికి అవునని సమాధానమిచ్చాడు. సూర్యాస్తమయంలో కత్రినా పెళ్లి ఫోటోలు చూడాలని కోరుకుంటుందని కూడా వెల్లడించాడు.
ఈ వేదికపై కపిల్ గోవింద నామ్ మేరా టీమ్ కి కపిల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. కియరా తదుపరి ఆర్.సి 15లో కథానాయికగా కనిపించనుంది. శంకర్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. మరోవైపు ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కియరా పెళ్లికి సమయం ఎంతో దూరంలో లేదని కూడా ప్రచారం సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.