Begin typing your search above and press return to search.
ప్రేమించిన వాడు మోసం చేస్తే ఏం చేస్తావ్ ?
By: Tupaki Desk | 18 March 2021 5:52 AM GMTతెలుగులో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో నటించి మళ్లీ ఇటు వైపు కూడా చూడనంత బిజీ అయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. బాలీవుడ్ లో చాలా బిజీ అయిన ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్ములను చీట్ చేస్తే మీరు మొదట చేసేది ఏంటీ.. ఆ సమయంలో మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించిన సమయంలో చాలా జెన్యూన్ గా సమాధానం చెప్పింది. ఏమాత్రం మొహమాటం లేకుండా వదిలేస్తాను అంటూ పేర్కొంది.
కియారా మాట్లాడుతూ.. నా ప్రియుడు కనుక నన్ను మోసం చేసినట్లుగా నిరూపితం అయితే వెంటనే నేను నా ఫోన్ లో అతడి నెంబర్ ను బ్లాక్ చేస్తాను. ఆ తర్వాత అతడి జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేస్తాను. అతడి మొహంను జీవితంలో చూడాలని భావించడం లేదు. అలాగే అతడి మోసంను ఎప్పటికి మర్చి పోకుండా గుర్తు పెట్టుకుంటాను. మళ్లీ అలా మోసపోకుండా జాగ్రత్త పడతాను అంది. ఈ అమ్మడి రియల్ లైఫ్ రొమాంటిక్ లైఫ్ విషయానికి వస్తే గత కొంత కాలంగా సిద్దర్థ్ మల్హోత్రాతో సన్నిహితంగా ఉంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మద్య విషయం ఏంటీ అనే విషయమై ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా జాతీయ మీడియాలో మాత్రం వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా కథనాలు రాస్తున్నాయి. ఈ విషయమై వారు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.