Begin typing your search above and press return to search.

చిట్టిబాబుకి బోయపాటి డోసు మాసు సాంగ్ !

By:  Tupaki Desk   |   14 Nov 2018 8:21 AM GMT
చిట్టిబాబుకి బోయపాటి డోసు మాసు సాంగ్ !
X
రామ్ చరణ్ లేటెస్ట్ ఫిలిం 'వినయ విధేయ రామ' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్.. టీజర్లను ఈ మధ్యనే విడుదల చేశారు. బోయపాటి స్టైల్ కు తగ్గట్టే రామ్ చరణ్ ను ఫుల్ మాస్ అవతారంలో చూపించాడు. టీజర్ తో సినిమా ఎలా ఉండబోతోందో హిట్ ఇచ్చేశాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్ కోసం ఒక మంచి మాస్ మసాలా సాంగ్ ను ప్లాన్ చేశాడట బోయపాటి. అసలే దేవీ శ్రీ ప్రసాద్ మాస్ ట్యూన్లు అందించడంలో దిట్ట. చరణ్ లాంటి మాస్ హీరో అందులోనూ బోయపాటి డైరెక్షన్ అంటే ఇది ఫుల్ మాసని అందరూ ముందే ఫిక్స్ అయిపోయారు. అందుకే ఈ సినిమాకోసం దేవీ ఒక పవర్ఫుల్ మాస్ ట్యూన్ అందించాడట. కాకపోతే ఇది ఐటెం నంబర్ లాంటిది కాదు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించే మాస్ డ్యూయెట్ అని సమాచారం. సినిమాలో ఈపాట చివరిదట.

చరణ్ - దేవీ శ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' ఆడియో సూపర్ డూపర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. 'రంగస్థలం' బ్లాక్ బస్టర్ విజయం సాధించడానికి దేవీ మ్యూజిక్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. దీంతో చరణ్- దేవీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగూ మాస్ సినిమా కాబట్టి దేవీ మరోసారి మ్యాజిక్ చేస్తాడని అంటున్నారు. త్వరలో 'వినయ విధేయ రామ' నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తారట.