Begin typing your search above and press return to search.
చరణ్ అలా అన్నాడట
By: Tupaki Desk | 4 Jan 2019 12:31 PM GMTబాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు ‘భరత్ అనే నేను’ చిత్రంతో పరిచయం అయ్యింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కైరాకు పలు ఆఫర్లు వచ్చాయి. కాని భరత్ అనే నేను తర్వాత రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో మాత్రమే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో సంక్రాంతి కానుకగా ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంతో తెలుగులో మరో విజయాన్ని సొంతం చేసుకుంటానంటూ కైరా అద్వానీ చాలా నమ్మకంతో చెబుతోంది.
వినయ విధేయ రామ చిత్రం విడుదల సందర్బంగా కైరా అద్వానీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈ చిత్రంలో నేను సీత పాత్రలో కనిపించబోతున్నాను. ఈ చిత్రంలో కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా సాంప్రదాయబద్దంగా ఉంటాయి. చరణ్ తో నేను కలిసి చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయి. మా ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకులు కూడా అంటారు.
ఈ సినిమాలో చరణ్ తో కలిసి రామ లవ్స్ సీత.. అనే పాటకు చేసిన డాన్స్ ను నేను మర్చి పోలేను. ఆ పాటలో ఇద్దరం కూడా చాలా బాగా డాన్స్ చేశాం. చరణ్ మంచి డాన్సర్ - ఆయన నాతో డాన్స్ చేయడం ఇష్టమని చెప్పాడు. ఆ మాట నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. చరణ్ వంటి మంచి డాన్సర్ నాతో డాన్స్ చేయడం ఇష్టమని చెప్పడం నాకు గర్వంగా అనిపించిందని కైరా అద్వానీ చెప్పుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత ఈమె అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.