Begin typing your search above and press return to search.

కీయరా అద్వానీ హాట్ షో.. పాప పర్ఫెక్ట్!

By:  Tupaki Desk   |   23 Jun 2022 2:30 AM GMT
కీయరా అద్వానీ హాట్ షో.. పాప పర్ఫెక్ట్!
X
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కీయరా అద్వానీ సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో చాలా తెలివిగా ఆలోచిస్తుందనే చెప్పాలి. ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా వెంటనే మరో సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతుంది. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ సక్సెస్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. కేవలం సినిమాలతోనే కాకుండా కీయరా గ్లామరస్ వరల్డ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకునే ప్రయత్నం అయితే చేస్తోంది.

ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తే ఎవరైనా సరే ఎట్రాక్ట్ అవ్వాల్సిందే. రోజురోజుకు అమితంగా గ్లామర్ డోస్ పెంచుతున్న కీయరా రీసెంట్ గా ఒక స్టైలిష్ డ్రెస్ లో ఎద అందాలని మరోసారి హైలెట్ అయ్యేలా చేసింది.

కీయరా ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు మరోసారి తన గ్లామర్ తో న్యూ ఫొటోస్ ను వైరల్ అయ్యేలా చేసింది.

ఇక కీయరా అద్వానీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. హిందీలోనే కాకుండా టాలీవుడ్ పై కూడా ఈ బ్యూటీ మొదటి నుంచి కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తోంది.

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీయరా ఆ తరువాత రామ్ చరణ్ బోయపాటి కలయికలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అమ్మడి ఫోకస్ రామ్ చరణ్ 15వ సినిమాపైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటి పెద్ద సినిమాలతో బిజీగా ఉంది. ఇక త్వరలోనే తెలుగు హీరోతోనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.