Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : గుండెల్లో గిటారు మోగించేస్తున్న కియరా..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 5:30 AM GMT
ఫోటో స్టోరీ : గుండెల్లో గిటారు మోగించేస్తున్న కియరా..!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న కియరా అద్వాని తన సినిమాలతో పాటుగా తన గ్లామర్ టాలెంట్ తో కూడా మెప్పిస్తుంది. అమ్మడి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయిన్ టైన్ చేస్తూ వస్తున్న కియరా అప్పుడప్పుడు తన అందాలకు పని చెబుతుంది.

లేటెస్ట్ గా పింక్ కలర్ డ్రెస్ లో ఉప్పొగుతున్న ఎద అందాలను బంధిస్తూ అబ్బో అమ్మడి ఫోటో షూట్ చూసిన వారికి నిద్ర పట్టదంటే నమ్మాల్సిందే. చూపు తిప్పుకోనివ్వని అందం అమ్మడి సొంత.

తన గ్లామర్ ట్రీట్ తో కుర్రాళ్ల గుండెల్లో గిటారు మోగించేస్తుంది అమ్మడు. కియరా ఈ రేంజ్ రెచ్చిపోవడం ఆమె కెరీర్ గ్రాఫ్ ని మరింత పెంచేస్తుందని చెప్పొచ్చు. చేతినిండా సినిమాలు ఉన్నా గ్లామర్ షోలో కూడా అసలు తగ్గనంటుంది కియరా. లేటెస్ట్ పింక్ డ్రెస్ ఫోటో షూట్ లో కియరా అందాల ప్రదర్శన ఆడియన్స్ ని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.

గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే మడి కట్టుకు కూర్చుంటే సరిపోదు. అందుకే అమ్మడు తన మార్క్ స్కిన్ షోతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా కియరా అలరిస్తుంది. తనకు ఛాలెంజింగ్ గా అనిపించిన ప్రతి పాత్రని చేస్తూ కెరీర్ స్ట్రాంగ్ గా మార్చుకుంది కియరా అద్వాని. కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది.

మహేష్ తో భరత్ అనే నేను చేసిన కియరా అద్వాని చరణ్ తో వినయ విధేయ ఆమ మూవీ చేసింది. ప్రస్తుతం చరణ్ తో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండిటిని బ్యాలన్స్ చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తుంది కియరా.

ఇక బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్ హోత్రాతో అమ్మడి ప్రేమాయణం గురించి కూడా అందరికి తెలిసిందే. త్వరలోనే అతనితో పెళ్లికి రెడీ అవుతుందట అమ్మడు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.