Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మారిషస్ లో కియారా తుఫాను

By:  Tupaki Desk   |   3 Sep 2019 2:30 PM GMT
ఫోటో స్టొరీ: మారిషస్ లో కియారా తుఫాను
X
బాలీవుడ్లో చాలామందే హాటు భామలు ఉన్నారు కానీ హాట్ నెస్ కోసమే పుట్టిన భామ అన్నట్టుగా ఉండేది మాత్రం కియారా అద్వాని మాత్రమే. మిగతా హీరోయిన్లను తీసుకుంటే ఏదో ఒక లోటు ఉంటుంది కానీ కియారా దగ్గర ఉండాల్సిన ప్లస్సులు అన్నీ ఉన్నాయి. నటన.. బోల్డ్ నెస్.. గ్లామర్.. పీఆర్ నెట్వర్క్ ఇలా ఒక స్టార్ హీరోయిన్ కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉండడంతో కియారా క్రేజీ హీరోయిన్ గా బాలీవుడ్ లో పైపైకి దూసుకుపోతోంది.

తాజాగా ఈ భామ ట్రావెల్ + లీజర్ మ్యాగజైన్ సెప్టెంబర్ ఎడిషన్ కవర్ పేజిపై మెరిసింది. ఈ మ్యాగజైన్ వారు తమ అధికారిక ఇన్స్టా పేజిలో ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ మ్యాగజైన్ కు 13 వ వార్షికోత్సవం కావడంతో కియారా తనదైన స్టైల్ లో విభిన్నమైన దుస్తుల్లో.. అద్బుతమైన లోకేషన్లలో ఈ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఈ సెప్టెంబర్ సంచికలో కియారా పై "సోక్స్ అప్ ది సన్ ఇన్ మారిషస్" అంటూ ఒక కథనం కూడా ప్రచురించారు.

ఈ ఫోటోకు "తన సినిమాలతో.. ఫోటో షూట్లతో ప్రపంచాన్ని తుఫానులా కమ్ముకోవాలని కియారా ఆలోచన" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ ఫోటో షూట్ చేసిన ప్రదేశం హెరిటేజ్ లే టెల్ ఫెయిర్ గోల్ఫ్ అండ్ వెల్ నెస్ రిసార్ట్.. మారిషస్. ఫోటో విషయానికి వస్తే బ్లాక్ కలర్ టాప్.. అదే రంగు స్కర్ట్ ధరించి ఒక సముద్రం ఒడ్డున తక్కువ లోతు ఉన్న నీటిలో బోటుపై యమా హాటుగా కూర్చుంది. అందాలను ఆరేస్తూ హాట్ ఎక్స్ ప్రెషన్ తో ఒక సముద్రపు దేవతలా కనిపిస్తోంది. ఈ ఫోటో షూట్.. గ్లామర్ ఎఫెక్ట్ తో తో మారిషస్ లో ఉష్ణోగ్రతలు ఓ నాలుగైదు డిగ్రీలు పెరిగి ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈ ఫోటోకు నెటిజన్లు లైకులతో హోరెత్తించారు. బోల్డ్ అని.. హాట్ అని.. సెక్సీ అని ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్లు పెట్టారు. ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే 'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది.