Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : త్రాచు పొర విడిచినట్టు!
By: Tupaki Desk | 26 Oct 2018 7:39 AM GMTకెమెరా ముందు హొయలు పోవడంలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ తప్పనిసరి. నడక - నడత - చూపు - వయ్యారం - సింగారం.. ఇవన్నీ కొట్టొచ్చినట్టు ఎలివేట్ కావాలి. చూడగానే కుర్రకారు గుండెలు జిల్లనాలి. డిజైనర్ దుస్తుల్ని ఎలివేట్ చేస్తూనే ఒంపు సొంపుల్ని రంగరించి ప్రత్యేకమైన విరుపుతో చూపరుల మతి చెడగొట్టాలి. అప్పుడే మార్కులు వేయడంలో జడ్జీలు పోటీపడతారు. మోడళింగ్ - ఫ్యాషన్ రంగంలో ఇదంతా ఓ పెద్ద సబ్జెక్ట్. ఎవరు ఎక్కువగా తమని ఎలివేట్ చేసుకోగలరో వాళ్లను విరివిగా అవకాశాలు వరిస్తాయి. రంగుల ప్రపంచంలో ఛాన్సులు వరించేది ర్యాంపుపై ఆరితేరినప్పుడే.
ఇలాంటి గజకర్ణ గోకర్ణ విద్యల్లో ఆరితేరిపోయింది కాబట్టే కియరా కువకువలు బాలీవుడ్ - టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్ని వేగంగా చుట్టేస్తున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు ముంబై నగరాన్ని ఒణికిస్తోంది. అక్కడ ఏ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా, ఏ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఈవెంట్ ప్లాన్ చేసినా అందులో కియరా మెరవాల్సిందే. తనో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇండస్ట్రీలో ఎందరు టాప్ మోడల్స్ ఉన్నా కియరా ముందు సైడివ్వాల్సిందే అన్నంతగా పాపులరైపోయింది. మరోవైపు బాలీవుడ్ చిత్రాలతోనూ కియరా బిజీబిజీ.
లేటెస్టుగా ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన `వెడ్డింగ్ జంక్షన్ షో`లో కియరా షోనే హైలైట్ గా నిలిచింది. ఈ స్పెషల్ ఈవెంట్‌లో ప్రత్యేకంగా తనకోసం మాత్రమే డిజైన్ చేసిన మెరుపుల(షిమ్మరీ) కుర్తాలో తళాంగుతళుకులతో ఒయ్యారాల వడ్డనలు చేసింది. పొడవాటి కాళ్లను వంకీలు తిప్పుతూ నడుస్తూనే, వీ నెక్ అందాల్ని ఆరాంగా ఎలివేట్ చేసింది. హంసనడకలతో ఒంపు సొంపులను ఎలివేట్ చేసిన ఈ అమ్మడి అందాలకు యూత్ సమ్మోహనంలో మునిగిపోయారంటే అతిశయోక్తి కాదు. మరో కోణంలో డీప్‌గా పరిశీలిస్తే కెమెరా ముందు పొర విడుస్తున్న త్రాచు పాములా కినిపంచింది కియరా. `ఎం.ఎస్.ధోని- యాన్ అన్ టోల్డ్ స్టోరి` చిత్రం తర్వాత టాలీవుడ్ లో `భరత్ అనే నేను` చిత్రంతో తొలి అడుగులు వేసింది. ఆరంభమే ఇక్కడా బ్లాక్ బస్టర్. ప్రస్తుతం రామ్‌చరణ్ సరసన టాలీవుడ్ కెరీర్ లో కీలకమైన సినిమాలో నటిస్తోంది. ర్యాంప్ షోలతో ముంబైని అదరగొడుతూనే, కథానాయికగా కెరీర్‌ని చక్కదిద్దుకుంటోంది కియరా. మరోవైపు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన `అర్జున్ రెడ్డి` రీమేక్ లోనూ కథానాయికగా నటిస్తోంది.