Begin typing your search above and press return to search.

'క్యాచ్' ప‌ట్టేస్తే ఎమ‌ర్జింగ్ స్టారేనా?

By:  Tupaki Desk   |   20 Feb 2019 5:36 AM GMT
క్యాచ్ ప‌ట్టేస్తే ఎమ‌ర్జింగ్ స్టారేనా?
X
కుర్ర‌కారు అటెన్ష‌న్ ని క్యాచ్ చేస్తే ఎమ‌ర్జింగ్ స్టార్ అయిన‌ట్టేనా? అంటే అవున‌నే ప్రూవ్ చేసింది కియ‌రా అద్వాణీ. ఈ అమ్మ‌డు ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ప్ర‌కంప‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ టు సౌత్ ఇండ‌స్ట్రీ కియ‌రా ప్ర‌కంప‌నాల‌కు ఎదురే లేకుండా పోయింది. ఈ అమ్మ‌డు స్టైల్ ఐక‌న్ గా ఫ్యాష‌న్ ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది. మ‌రోవైపు క‌థానాయిక‌గా క్రేజీ సినిమాల్లో న‌టిస్తూనే ర్యాంప్ వాక్ ల‌తో దుమారం సృష్టిస్తోంది. ప‌ర్య‌వ‌సానంగా ప్ర‌ఖ్యాత ఏసియా విజ‌న్స్ ఈ బ్యూటీని 2018 ఎమ‌ర్జింగ్ స్టార్ గా ప్ర‌క‌టించింది.

ఐ క్యాచింగ్ గాళ్ గా కియ‌రా సాధించిన‌ది ఎంతో ఉంది అంటూ ఈ అవార్డు క‌ర్త‌లు కీర్తించేయ‌డాన్ని బ‌ట్టి .. అంద‌రి దృష్టిని త‌మ‌వైపు తిప్పుకునే నాయిక‌ల‌కు ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో స‌రైన గుర్తింపు ద‌క్కుతుంద‌ని ప్రూవైంది. ఎం.ఎస్.ధోని చిత్రంతో బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన కియ‌రా - అటుపై భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో పెద్ద స‌క్సెస్ అందుకుంది. ఇటీవ‌లే `విన‌య విధేయ రామ` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ తో పాటు.. సౌత్ ఇండ‌స్ట్రీస్ లోనూ కియ‌రా గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

కియ‌రా అంద చందాల గురించి.. ఫ్యాష‌న్ ఎలివేష‌న్ గురించి యువ‌త‌రంలో ప‌దే ప‌దే చ‌ర్చ సాగుతూనే ఉంది. తాజాగా ఎమ‌ర్జింగ్ స్టార్ అన్న కీర్తిని అందుకుంది కాబ‌ట్టి మ‌రింత‌గా దూసుకుపోతుంద‌న‌డంలో సందేహం లేదు. త‌దుప‌రి కియ‌రా న‌టిస్తున్న క‌బీర్ సింగ్ (అర్జున్ రెడ్డి రీమేక్) ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందో వేచి చూడాల్సిందే. టాలీవుడ్ లో లేటెస్ట్ గా ఓ స్టార్ హీరో సినిమాకి సంత‌కం చేశాన‌ని కియ‌రా ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించింది. మునుముందు త‌మిళం స‌హా ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఈ అమ్మ‌డు కెరీర్ ని సాగిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.