Begin typing your search above and press return to search.
చావు కళ్లలో కళ్లు పెట్టి చూసిందట
By: Tupaki Desk | 4 Jun 2022 4:29 AM GMTదాదాపు మృత్యు ముఖం వరకూ వెళ్లింది. కానీ ఇంతలోనే తనని ఏదో శక్తి కాపాడింది. ఆ కాళరాత్రిలో అది భయానక అనుభవం. చుట్టూ మంటలు కమ్మేశాయి. ఏం జరుగుతోందో పాలుపోని పరిస్థితి. కానీ దాని నుంచి ఆ క్షణం బయటపడగలిగింది. ఇంతకీ ఇది ఎవరి అనుభవం? అంటే.. స్టార్ హీరోయిన్ కియరా అద్వాణీకి రియల్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ ఇది.
కియారా అద్వానీ తాజాగా ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని భయానక అనుభవం గురించి మాట్లాడింది. తన కాలేజీ రోజుల్లో ధర్మశాలలో తాను చావుకు దగ్గరగా వెళ్లిన అనుభవాన్ని గుర్తుచేసుకుంది. తాను దెయ్యాలను నమ్మనని చెప్పింది కానీ..ఆ రోజు తన గదిలో మంటలు చెలరేగడానికి కారణమేమిటో ఇప్పటికీ తెలియదని వెల్లడించింది.
కియారా అద్వానీ ఇటీవల విడుదలైన తన హర్రర్-కామెడీ 'భూల్ భూలయ్యా 2' విజయంతో రెట్టించిన ఉత్సాహంలో ఉంది. తన సినిమా ప్రమోషన్స్ లో ఎన్నో బయటికి తెలియని సంగతుల్ని చెబుతోంది. ఇటీవల కాస్మోపాలిటన్ ఇండియా కవర్ పేజీపై కనిపించిన కియరా ఆమె మరణానికి సమీపంగా వెళ్లిన నాటి అనుభవాన్ని ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. సదరు మ్యాగజైన్ తో నిజాయితీగా జరిగిన విషయాలను చాట్ చేసింది. తాను దెయ్యాలను నమ్మనని తన గదిలో ఒంటరిగా పడుకోవాల్సి ఉంటుందనే భయంతో హారర్ సినిమాలు కూడా చూడనని కియరా చెప్పింది.
గతంలో ఒకానొక టెరిఫిక్ అనుభవం గురించి కియారా మాట్లాడుతూ-"నేను కాలేజీలో ఉన్నప్పుడు నా బ్యాచ్ మేట్స్ నేను ధర్మశాలలోని మెక్ లియోడ్ గంజ్ కి వెళ్లాము. అక్కడ మేము నీళ్లు విద్యుత్ లేకుండా నాలుగు రోజుల పాటు హోటల్ రూమ్ లోనే చిక్కుకున్నాము. ఆ ప్రాంతం భారీ హిమపాతంతో నిండి ఉంది. అసలే మైనస్ డిగ్రీల చలి... మా 'భోగి మంట' కూడా త్వరగానే ఆరిపోయింది. ఆ రాత్రి నా గదిలోని కుర్చీలో మంటలు చెలరేగాయి... అది మరణానికి దగ్గరైన అనుభవం! అదృష్టవశాత్తూ నా స్నేహితుల్లో ఒకరు సమయానికి మేల్కొని అరిచారు ... మేమంతా మంచం మీద నుండి దూకి తలుపు బద్దలు కొట్టి ఉపాధ్యాయులను పిలవగలిగాము. ఇది చాలా బాధాకరమైనది. కానీ మేమంతా కృతజ్ఞతతో ఉండాలని నిర్ణయించుకున్న రోజు అది అని నేను అనుకుంటున్నాను. అలాంటి అనుభవాలు జీవితాన్ని భిన్నమైన కోణంలో చూడాలని నేర్పిస్తాయి. దానిని అభినందించాలి" అని తెలిపారు.
కియారా- కార్తీక్ ఆర్యన్- టబు-రాజ్ పాల్ యాదవ్ లాంటి టాప్ తారాగణంతో అనీష్ భజ్మి తెరకెక్కించిన భూల్ భులయా 2 హారర్ నేపథ్యంలో రూపొందిన హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్. ఈ మూవీ కియరా కెరీర్ కి బిగ్ బూస్ట్ అని చెప్పాలి. విడుదలైన రెండు వారాల్లోనే 100 కోట్ల మార్క్ ను దాటింది. 150కోట్ల వసూళ్లతో ఇంకా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఆకాష్ కౌశిక్- ఫర్హాద్ సామ్జీ ఈ చిత్రానికి కథను అందించగా..టి-సిరీస్ ఫిల్మ్స్ పతాకంపై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - సినీ1 స్టూడియోస్ నిర్మించాయి. మురాద్ ఖేతాని - అంజుమ్ ఖేతాని -భూషణ్ లు కలిసి నిర్మించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... కియారా తదుపరి రాజ్ మెహతా దర్శకత్వం వహించిన 'జగ్ జగ్ జీయో'లో కనిపించనుంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్- కియారా అద్వానీ- అనిల్ కపూర్- నీతూ కపూర్- మనీష్ పాల్ - ప్రజక్తా కోలి నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 24న విడుదల కానుంది. రామ్ చరణ్-శంకర్ తో కలిసి 'RC-15' షూటింగ్ లోను కియరా బిజీగా ఉంది. విక్కీ కౌశల్ తో కలిసి 'గోవింద నామ్ మేరా'లో నటిస్తోంది.