Begin typing your search above and press return to search.
అహంకారులను పరిశ్రమ ఇంటికి పంపేస్తుంది!- కియారా
By: Tupaki Desk | 26 Aug 2021 3:30 AM GMTబాలీవుడ్ నటి కియారా అద్వాణీ తక్కువ స్పాన్ లో అత్యంత వేగంగా స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్న నాయిక. కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. వరుసగా బిగ్ స్టార్స్ సరసన ఛాన్సులందుకుంటూ వెలిగిపోతుంది. బాలీవుడ్ కబీర్ సింగ్ ఘనవిజయం తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదని అమ్మడు ఒడిసిపట్టుకుంటోన్న ప్రాజెక్ట్ లను బట్టే తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లో నూ అగ్ర హీరోలతోనే సినిమాలు చేస్తోంది. `భరత్ అనే నేను`..`వినయ విధేయ రామ` సినిమాల్లో నటించాక ఇప్పుడు రెండవ సారి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇది చరణ్ రెండవ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. దీని(ఆర్.సి15)కి దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కియారాపై సంచలన వార్తలు మీడియా వర్గాల్లో హీటెక్కిస్తున్నాయి. కియారాకి గర్వం ఎక్కువని..అహంకారిగా ప్రవర్తిస్తుందని బాలీవుడ్ మీడియాలో ఇటీవల కథనాలు వెలువడుతున్నాయి. అహంకారంతో వచ్చిన అవకాశాల్ని కాదని...భారీ పారితోషికం సైతం వదులుకోవడానికి వెనుకాడటం లేదని ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ విమర్శలపై తనదైన శైలిలో స్పందించింది.
ఎలాంటి అహంకారం లేదని..అలాంటిదాన్నే అయితే పరిశ్రమ ఎందుకు అవకాశాలిస్తుందని కౌంటర్ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో అవకాశాలు కోసం ఎంతో కష్టపడ్డానని... ఎలాంటి సపోర్ట్ లేకుండా పరిశ్రమకు వచ్చి నటిని అయ్యానని తెలిపింది.
అహంకారమే ఉంటే సినిమా పరిశ్రమ అవకాశాలు ఇవ్వదని..ఆ విషయం వార్తలు రాసిన వాళ్లకు కూడా బాగా తెలుసని కౌంటర్ వేసింది. ఇలాంటి వార్తలు రాసే ముందు మనుషుల వ్యక్తిత్వాలు తెలుసుకోవాలని అసహాన్ని వ్యక్తం చేసింది. మనసులో ఇంకెదో పెట్టుకుని బయటకు మరో విషయాన్ని ఫోకస్ చేయడం వెనుక అంతరార్ధం ఏంటో గ్రహించలేనంత అమాయకురాలిని కాదని అంది. ఇటీవలే కియారా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఎంతో డౌన్ టూ ఎర్త్ మాట్లాడిన సంగతి తెలిసిందే. పరిశ్రమలో స్నేహితుల గురించి అడిగితే స్కూల్ డేస్ స్నేహితుల గురించి .. స్వచ్ఛమైన ప్రెండ్ షిప్ అనేది ఎలా ఉండాలనేది ఎంతో చక్కగా వివరించిన సంగతి తెలిసిందే. కియరా ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది.