Begin typing your search above and press return to search.
పది లోనే లవ్ ఫెయిల్యూర్ అంటున్న బ్యూటీ
By: Tupaki Desk | 22 Jun 2019 12:57 PM GMTలవ్ ను సినిమాల్లో మరీ అతిగా గ్లామరైజ్ చేస్తారు కానీ ఒక సాధారణమైన మనిషి తన జీవితంలో మాస్ మహారాజా రవి తేజ 'నా ఆటోగ్రాఫ్' సినిమాలో లాగా కనీసం రెండు మూడు నాలుగు సార్లు లవ్ లో పడతారు. ఇక రసిక.. కళాత్మక హృదయులైతే ఎన్ని సార్లు లవ్ లో పడతారో.. లేస్తారో లెక్కాపక్కా ఉండదు. అయినా అదేం తప్పు కాదు లెండి. అయినా ఇప్పుడు ఆ లవ్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే 'కబీర్ సింగ్' వల్లే.
'అర్జున్ రెడ్డి' బాలీవుడ్ రీమేక్ 'కబీర్ సింగ్' నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంతమంది క్రిటిక్స్ విమర్శలు గుప్పించారు. కొంతమంది మెచ్చుకున్నారు. అయితే వారి అభిప్రాయాలతో సంబంధం లేకుండా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. ఈ సినిమాలో షాహిద్.. కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో కియారా ను "మీ జీవితంలో లవ్ స్టొరీలు ఉన్నయా? ఎప్పుడైనా ప్రేమించిన వ్యక్తికి దూరమై బాధపడ్డారా?" అని ప్రశ్నించారు. దీనికి కియారా ఓపెన్ గానే సమాధానం ఇచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
తను పదవ తరగతి చదివే సమయంలో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని వెల్లడించింది. అయితే ఒకరోజు అతనితో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటే కియారా అమ్మగారు కనిపెట్టేసి ఇలాంటి పనులన్నీ కట్టిపెట్టమని.. చదువుపై ఫోకస్ చెయ్యమని సున్నితంగా హెచ్చరించిందట! ఆ వార్నింగ్ పాటు ఇకపై అబ్బాయిలతో మాట్లాడకూడదని అల్టిమేటం జారీ చేసిందట. ఆ అబ్బాయిది విభిన్న మనస్తత్వం కావడంతో విడిపోయామని చెప్పింది
ఆసమయంలో బెడ్ మీద నుంచి లేచి బయటకు రావడానికి కూడా ఇష్టపడేది కాదట. అది చాలా కష్టమైన విషయంలా అనిపించేదని.. తర్వాత తన కెరీర్ పై దృష్టిపెట్టడంతో మామూలు మనిషి అయిందట. అప్పుడు విడిపోయిన వ్యక్తి ఇప్పుడు కూడా తనకు మంచి స్నేహితుడని తెలిపింది. అన్నీ చెప్తూనే ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది.