Begin typing your search above and press return to search.
హైస్కూల్ ప్రేమను త్యాగం చేసి విలవిల్లాడిందట
By: Tupaki Desk | 22 Oct 2020 12:30 AM GMTతొలి వలపు తాకిడిని తట్టుకోవడం అంత సులువా? టీనేజీ పరువాలు ఉబలాటం నిలవనివ్వవు. ప్రేమ దోమ కుడితే ఇక అంతే సంగతి. మలేరియా టైపాయిడ్ ఏం కర్మ అంతకుమించి ప్రమాదకర జ్వరం అంటుకున్నట్టే. పాపం కియరా అద్వాణీ కి కూడా అలాంటి అనుభవమే ఎదురైందట.
తెలిసీ తెలియని వయసులో ప్రేమించి నానా అగచాట్లు పడిందట. ప్లస్ 2లో తన ప్రేమ మరీ పీక్స్ కి చేరుకుందట. ప్రేమ గోలలో పడి కాలేజ్ చదువు గతి తప్పిందని తన పరిస్థితికి కారణమేంటో తెలీక ఇంట్లో షంటేసేవారని చెప్పింది కియరా. అంతేనా.. చివరికి ఆ ఒత్తిడి భరించలేక తనలో తాను సతమతమవుతూ ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిందని.. ఆ బాధ ఎంత ప్రాబ్లమాటిక్ గా ఉంటుందో తనకు అనుభవమైందని కియరా తెలిపింది.
హైస్కూల్ ప్రేమను త్యాగం చేసి విలవిలలాడానని కియరా చెప్పడం చూస్తుంటే తన జీవితంలో ఎంతో మదనం ఉందని అర్థం చేసుకోవచ్చు. విఫలమైన ప్రేమే జీవితాంతం నీడలా వెంటాడుతుందనేందుకు కియారా చెప్పుకొచ్చిందంటే అది ఎంత ఘాడమైన ప్రేమో అర్థం చేసుకోవాలి. మానసిక వేదనకు గురైనా కానీ పరిపక్వత సాధించి నెమ్మదిగా ఆ ట్రామా నుంచి బయటపడిందట. కియరా నటించిన లక్ష్మీ బాంబ్ ఓటీటీ ట్రీట్ కి రెడీ అవుతోంది. టీజర్ పాటలు మెప్పిస్తున్నాయి.