Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఎయిర్ పోర్ట్ లో సూపర్ వుమన్!

By:  Tupaki Desk   |   16 Oct 2019 9:41 AM GMT
ఫోటో స్టోరీ: ఎయిర్ పోర్ట్ లో సూపర్ వుమన్!
X
బాలీవుడ్ లో బిజియస్ట్ భామలలో ఒకరు కియారా అద్వాని. ఈమధ్య 'కబీర్ సింగ్' ఘన విజయంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాలతో ఈ భామ ఎంత బిజీగా ఉన్నాప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేయడం మాత్రం మానదు. కియారా మొదటి నుంచి ఒక ఫ్యాషన్ ఐకాన్. సినిమా ఈవెంట్ అయినా.. ఫ్యాషన్ షో అయినా.. జిమ్ అయినా.. ఆఖరికి ఎయిర్ పోర్ట్ అయినా తన డ్రెస్సులు చూసి ఔరా ఔరౌరా అనిపించేలా చేస్తుంది.

రీసెంట్ గా కియారా అద్వాని ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోటోగ్రాఫర్లు కియారా ఫోటోలను క్లిక్కుమనిపించారు. బ్లాక్ ప్యాంట్.. నియాన్ గ్రీన్ టాప్ ధరించి.. ఆ టాప్ పైన బ్లాక్ ఇన్నర్ వేర్ ధరించింది. ఇదోరకం సూపర్ మ్యాన్ స్టైల్ అనుకోండి. కియారా ఒక వుమన్ కాబట్టి సూపర్ వుమన్ అని మనం సరిపెట్టుకోవాలి. పెద్ద సైజ్ లో ఉన్న హ్యాండ్ బ్యాగ్.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ తో స్టైలుకు నిర్వచనంలాగా కనిపించింది. తను ఇలా కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు పండగ చేసుకుంటారనే సంగతి తెలుసు కాబట్టి వారికి స్మైల్ ఇస్తూ పోజిలిస్తూ వయ్యారంగా నడుస్తూపోయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కియారా సినిమాల విషయానికి వస్తే చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కియారా 'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలే కాకుండా మరో రెండు మూడు ఆఫర్లు లైన్లో ఉన్నాయట. ఈలెక్కన వచ్చే ఏడాది బాలీవుడ్ ను కియారా ఒక ఊపు ఊపడం ఖాయమే.