Begin typing your search above and press return to search.

కైపెక్కించే పోజుతో 'ఫిల్మ్ ఫేర్' మ్యాగజైన్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   17 March 2021 6:46 AM GMT
కైపెక్కించే పోజుతో ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ బ్యూటీ!
X
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కియారా అద్వానీని గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మత్తెక్కించే సోయగాలతో మాయ చేయడం కియారాకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం బాలీవుడ్ జనాల్లో బాగా వినిపిస్తున్న పేరు కియారాదే. వరుసహిట్లతో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. అయితే సినిమాలతో పాటు మోడలింగ్ కూడా అదేరేంజిలో మెయింటైన్ చేస్తోంది అమ్మడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో వెంటనే రాంచరణ్ సరసన వినయవిధేయరామ సినిమా చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. అప్పటినుండి మళ్లీ తెలుగులో కనిపించలేదు.

కియారా బాలీవుడ్ లో మరీ బోల్డ్ గా తయారైంది. ఎలాగంటే అందాల ఆరబోతలో.. శృంగార సన్నివేశాలలో నటించేందుకు ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. కబీర్ సింగ్, లస్ట్ స్టోరీస్ లతో పాటు గిల్టీ వెబ్ సిరీస్ లో కూడా రొమాంటిక్ బోల్డ్ క్యారెక్టర్ చేసింది. సినిమాలలో కియారా పండించే రొమాన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఫోటోషూట్ లతో అదరగొట్టటం కూడా కియారాకు మాములే. ఈ భామకు మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అందుకే అమ్మడు మోస్ట్ గ్లామరస్ ఫోటోషూట్లతో కూడా సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇదివరకే టాప్ లెస్ అండ్ బికినీ ఫోటోషూట్ లతో సెగలురేపిన వయ్యారి.. తాజాగా ఫిల్మ్ ఫేర్ అనే మ్యాగజైన్ కోసం మోస్ట్ గ్లామరస్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలలో కియారా టాప్ టు బాటమ్ అందాలు చూస్తూ కుర్రాళ్ళు మతులు పారేసుకుంటున్నారు. స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో కైపెక్కించే నడుము, థైస్ షోతో ఆకట్టుకుంటుంది.