Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో కియారా వాటితో టైంపాస్ చేస్తోందట...!

By:  Tupaki Desk   |   7 May 2020 5:17 AM GMT
లాక్ డౌన్ లో కియారా వాటితో టైంపాస్ చేస్తోందట...!
X
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు రకరకాల వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఖాళీ సమయం దొరకడంతో తమలో దాగి ఉన్న ఇతర నైపుణ్యాలను బయటకి తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా తనకు దొరికిన ఈ హాలిడేస్ ని బాగా యూస్ చేసుకుంటోంది. కుంచె పట్టి బొమ్మలు గీస్తోంది. అలానే ముఖ్యంగా మూడు విషయాలతో ఈ లాక్ డౌన్ ని టైంపాస్ చేసేస్తోందట. అవేంటంటే 'లూడో' 'కిచిడి' 'స్ట్రేంజర్ లవ్'. ప్రతిరోజూ తన స్నేహితులతో ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఆన్లైన్ లో లూడో గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తోందట. అంతేకాకుండా తాను చిన్నతనంలో ఉన్నప్పుడు వచ్చిన సినిమాలను చూస్తోందట. కిచెన్ రూమ్ లోకి వెళ్లి తన ఫేవరేట్ కిచిడి వండుతోందట. వాటితో పాటు కొన్ని వంటల వీడియోలు చూసి వెజిటబుల్ ఐటమ్స్ మరియు హల్వా కేకులు చేయడం నేర్చుకుందట. ఇక తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక స్ట్రేంజర్ బాగోగులు చూసుకుంటుందట. ఆ స్ట్రేంజర్ కరోనా బారిన పడటంతో ఆమె హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండేదట. అయితే ప్రస్తుతం ఆమె బాగానే ఉందని కియారా చెప్పుకొచ్చిందట. ఏదేమైనా ఒక సెలబ్రిటీ అపరిచితురాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని డైలీ ఆమె క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం గొప్ప విషయమే కదా. అందుకే ఆమె అభిమానులు కియారా గ్రేట్ అని కొనియాడుతున్నారు.


ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్‌లో ‘ఫగ్లీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన కియారా అద్వానీ.. ఆ తర్వాత భారత మాజీ క్రికెటర్ ‘ఎం.ఎస్.దోని’ జీవిత కథపై తెరకెక్కించిన ‘ఎం.ఎస్.దోని ది అన్‌ టోల్డ్ కహాని’ సినిమాతో కథానాయికగా బ్రేక్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ బాట పట్టిన కియారా అద్వానీ.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మొదటి సినిమా ఇచ్చిన జోష్ తో వెంటనే రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఈ సినిమా పరాజయం పాలైనా కియారా అందాల ఆరబోతకు అవకాశం కల్పించింది. ఈ భామ షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌ తో బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది కియారా. లాక్‌ డౌన్‌ కు ముందు కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భూలైయా 2' చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. అంతేకాకుండా 1999 కార్గిల్ యుద్ధంలో తన ప్రాణాలను త్యాగం చేసిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా నిర్మించిన అక్షయ్ కుమార్ - సిధార్థ్ మల్హోత్రా నటించిన 'షెర్షా' సినిమాలో కనిపించనుంది. అలానే 'ఇందూ కి జవానీ'.. రాఘవ లారెన్స్ - అక్షయ్ కుమార్ కాంబోలో వస్తున్న 'లక్ష్మీ బాంబ్' లో కూడా కియారా నటించింది.