Begin typing your search above and press return to search.

వేదిక ఏదైనా ఈ జంట హ‌డావుడి ఎక్కువైంది!

By:  Tupaki Desk   |   2 April 2023 5:00 AM GMT
వేదిక ఏదైనా ఈ జంట హ‌డావుడి ఎక్కువైంది!
X
ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో మిరుమిట్లు గొలిపిన సంగ‌తి తెలిసిందే. ఆక‌ర్ష‌ణీయ‌మైన వేష‌ధార‌ణ‌ల‌తో ఎవ‌రికి వారు యూనిక్ ప్రిప‌రేష‌న్ తో ఈ వేదిక వ‌ద్ద అడుగుపెట్టారు. ఇందులో కొంద‌రు జంట‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ముఖ్యంగా ఈ ఈవెంట్ కే ప్రియానిక్ జంట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిల‌వ‌గా.. ఆ త‌ర్వాత ఇటీవ‌లే పెళ్ల‌యిన కొత్త జంట కియ‌రా అద్వాణీ- నిక్ జోనాస్ ఎంతో యూనిక్ స్టైల్ తో ఆక‌ట్టుకున్నారు.  నూతన వధూవరులు సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ ఈవెంట్ ఆద్యంతం క‌లియ‌తిరుగుతూ అక్క‌డివారితో మ‌మేక‌మై విష్ చేస్తూ కనిపించారు. ఇక ఇదే వేదిక‌పై మెరిసిన ప‌లువురు అంత‌ర్జాతీయ న‌టీన‌టుల‌తోను స‌ర‌దాగా టైమ్ స్పెండ్ చేసారు.

సిధ్- కియ‌రా జంట ఈ వేదిక వ‌ద్ద‌కు ప్రవేశించే ముందు కెమెరాల‌కు పోజులిచ్చారు. ఈ అంద‌మైన ఫోటోల‌ను కియ‌రా ఇన్ స్టాలో పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఈవెంట్ కోసం కియారా స్లీవ్ డిజైన‌ర్  గోల్డ్ బ‌బుల్ రూపం వెండి జాకెట్టు - స్కర్ట్ లో త‌ళుక్కుమంది. మనీష్ మల్హోత్రా ఈ డిజైన‌ర్ లుక్ ని రూపొందించారు. సిద్ధార్థ్ క్రీమ్ కలర్ కుర్తా-పైజామా- మ్యాచింగ్ బ్లేజర్ లో అందంగా కనిపించాడు.

కళ - సంస్కృతిని ప్రోత్సహించడానికి నీతా ఎం అంబానీ నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.. అని కియ‌రా ఈ పోటోల‌కు క్యాప్షన్ గా రాశారు. రాజస్థాన్‌- జైసల్మేర్‌లో ఫిబ్రవరి 7న సిద్ధార్థ్- కియారా పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌ర్క్ క‌మిట్ మెంట్ల‌తో బిజీ అయ్యారు. అయినా ఇద్దరూ ప‌లు ఈవెంట్ లకు హాజరవుతూ.. ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక‌రికొక‌రు పోటీప‌డుతూ దూసుకెళుతున్నారు.

కియారా తాజా పోస్ట్‌పై అభిమానులు ప్రేమను కురిపించారు. ఒక అభిమాని ఇలా వ్రాశాడు ''మీరు ఈ లుక్ లో చంపేసారు! అద్భుత‌మైన జంట‌! అంటూ ప్ర‌శంసించారు. పరిపూర్ణ జంట‌ అని కూడా వ్యాఖ్యానించాడు. చాలా మంది అభిమానులు కామెంట్ లలో రెడ్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ త‌మ ప్రేమ‌ను కురిపించారు. ఈ కార్యక్రమంలో.. కియారా తన గుడ్ న్యూజ్ సహనటి కరీనా కపూర్ తో చాట్ చేస్తూ కనిపించింది. సైఫ్ అలీ ఖాన్ - కరిష్మా కపూర్ లతో కలిసి కియ‌రా - సిద్ జంట‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

NMACC ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు హాలీవుడ్ తార‌లు హాజరయ్యారు. సోనమ్ కపూర్- కరణ్ జోహార్- అలియా భట్-రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే- సల్మాన్ ఖాన్ స‌హా అమీర్ ఖాన్ తన ముగ్గురు పిల్లలతో క‌లిసి వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చారు.

కియారా తదుపరి రొమాంటిక్ డ్రామా 'సత్యప్రేమ్ కి క‌థ‌'లో కార్తీక్ ఆర్యన్ తో కలిసి నటించనుంది. ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది.  రామ్ చరణ్‌-శంక‌ర్ ల కాంబినేష‌న్ చిత్రం 'గేమ్ ఛేంజర్‌'లోను కియ‌రా క‌థానాయిక‌.  విక్కీ కౌశల్ - భూమి పెడ్నేకర్ లతో కలిసి గోవింద నామ్ మేరాలో చివ‌రిసారిగా కనిపించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.