Begin typing your search above and press return to search.
బోయ్ ఫ్రెండా? ప్రియుడా? కియరానే చెప్పాలి
By: Tupaki Desk | 30 Dec 2020 10:31 AM GMTస్టార్ హీరోయిన్ కియారా అద్వానీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో లవ్ లో ఉందని అతడితో సుదీర్ఘ కాలం డేటింగ్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. తాజాగా నూతన సంవత్సర వేడుకల కోసం మల్హోత్రాతో కలిసి వెళుతూ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కడంతో తన సంబంధాన్ని అధికారికమేనని అంగీకరించినట్టేనని బాలీవుడ్ మీడియా కథనాల్ని ప్రచురిస్తోంది.
అయితే ఇది స్నేహమేనా లేక ఇంకేదైనానా? అన్నది కియరా కానీ సిద్ధార్థ్ మల్హోత్రా కానీ కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అసలింతకీ ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోందో వారే రివీల్ చేసేవరకూ కన్ఫామ్ చేయలేం.
కియారా అద్వానీ ప్రస్తుత యువనాయికల్లో బిజీ స్టార్. బ్యాక్ టు బ్యాక్ భారీ క్రేజీ ఆఫర్లతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో అలియా తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న కియరాకు డేటింగ్ చేసేంత సమయం ఉందా?
ఇంతకుముందు అలియా భట్ సైతం సిద్ధార్థ్ మల్హోత్రాతో చాలా కాలం పాటు స్నేహంలో ఉంది. కానీ మీడియా దానిని ప్రేమాయణం అంటూ ప్రచారం చేసింది. కానీ ఆ ఇద్దరూ దానిని అధికారికం చేయలేదు.
కియారా-సిద్ధార్థ్ ఈ రోజు ముంబై విమానాశ్రయంలో కలిసి జంటగా కనిపించారు. ఈ జంట నూతన సంవత్సర వేడుకల కోసం మాల్దీవులకు బయలుదేరుతున్నారు. ముఖం దాచుకుని కియారా పెద్ద ముసుగు ధరించి సిద్ధార్థ్ కారులోనే విమానాశ్రయానికి రావడంతో ఒక్కసారిగా ఊహాగానాలు పీక్స్ కి చేరుకున్నాయి. మేం ప్రేమ పక్షులం అని చెప్పేందుకే ఇలా చేశారు! అంటూ ఒకటే కథనాలు వేడెక్కిస్తున్నాయి. మాల్దీవులకు వెళ్లినంత మాత్రాన అది డేటింగేనా? తమ మధ్య డేటింగ్ నిజమేనని ప్రేమలో ఉన్నామని ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.