Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: కియారా కాస్మోపాలిటన్ హాట్ నెస్

By:  Tupaki Desk   |   22 March 2020 3:30 PM GMT
ఫోటో స్టోరీ: కియారా కాస్మోపాలిటన్ హాట్ నెస్
X
హిందీ భామలలో ఈమధ్య అపరిమితమైన క్రేజ్ సాధించిన హీరోయిన్ కియారా అద్వాని. 'కబీర్ సింగ్' విజయంతో ఓ వైపు అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ 'గిల్టీ' నెట్ ఫ్లిక్స్ వెబ్ ఫిలింతో అందరికీ ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే మరోవైపు ఇలా వెబ్ సీరీసులలో సత్తా చాటడం.. అందరినీ మెప్పించడం సాధారణమైన విషయమేమీ కాదు. అలాంటి ఫీట్ ను ఎంతో సులువుగా చేస్తున్నవ్యక్తి కియారా.

హాట్ ఫోటోషూట్లు చెయ్యడం.. మ్యాగజైన్ కవర్ పేజిలపై కనిపించడం ఈ భామకు కొత్తేమీ కాదు. ఈమధ్య కాస్మోపాలిటన్ అనే మ్యాగజైన్ కోసం కియారా ఓ ఫోటో షూట్ చేసింది. సదరు మ్యాగజైన్ కవర్ పేజిపై మెరిసింది. ఎయిర్ ఫోర్స్ పైలట్లు ధరించే సింగిల్ పీస్ ప్యాంట్ షర్టు లాంటిది ధరించి మరీ పోజులిచ్చింది. డెనిమ్ డ్రెస్ కావడంతో స్టైల్ ఎక్కువగానే ఉంది. పైన బటన్లు పెట్టుకోకుండా ఫక్తు బాలీవుడ్ ఘాటుభామలాగా గ్లామరసం పంచింది. నడుముకు పెట్టుకున్న బెల్ట్ కూడా స్టైల్ గా ఉంది. ఈ ఫోటోలకు కియారా ఇచ్చిన క్యాప్షన్ "నా విశ్వం ఇది..  ఇసోలేషన్ కు ఛీర్స్." అంటే కరోనా ఇసోలేషన్ లో కూడా ఇలా ఫ్యాషన్ ను చూపించ వచ్చని.. ఛీర్స్ చెప్పొచ్చని నిరూపించడం అందరికీ సాధ్యమయ్యే పనే కాదు.  ఈ ఫోటోలతో పాటు కియారా మరో వీడియో కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలోనేపథ్యంలో జేమ్స్ బాండ్ తరహా సంగీతం వస్తూ ఉంటే కియారా అలా నడుస్తూ వెళ్తుంది.

ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'భూల్ భులయ్యా 2'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది. అన్నీ క్రేజీ  ప్రాజెక్టులు కావడం విశేషం. ప్రస్తుతం కియారా డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉందట.