Begin typing your search above and press return to search.
ఎలక్ట్రిక్ కార్ల ప్రచారం కోసం కియరా బిగ్ కాంట్రాక్ట్?
By: Tupaki Desk | 23 July 2021 6:34 AM GMTకెరీర్ ప్రారంభించిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలను ఏల్తోంది కియరా అద్వాణీ. ఓ వైపు బాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు దక్షిణాది చిత్రసీమలోనూ తన క్రేజ్ తగ్గకుండా మెయింటెయిన్ చేస్తోంది. బిజీ నాయికగా ఓ వెలుగు వెలుగుతోంది. ఇక ఇదే అదనుగా తన క్రేజ్ ని పెంచుకునేందుకు పీఆర్ ఎత్తుగడలతో ఓ వైపు సినిమాలకు సంతకాలు చేస్తూనే.. వరుసగా వాణిజ్య ప్రకటనలకు కమిటవుతోంది. ఒక్కో చిత్రానికి 3కోట్ల పారితోషికం అందుకుంటూ ఏడాదికి సుమారు 12 కోట్ల ఆదాయం కలిగి ఉన్న కియరా ఒక్కో ప్రకటన కోసం కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటోందని సమాచారం.
ఇక కియరాకు సోషల్ మీడియాల్లో ఇన్ స్టా వేదికగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ వేదికపై ఏం ప్రచారం చేసినా లక్షలాది మంది వీక్షిస్తున్నారు. తాజాగా కియరా ఆడి హైఎండ్ ఎలక్ట్రిక్ కార్ కి ప్రమోషన్ చేస్తూ హీట్ పెంచింది. నిజానికి పెట్రోల్ ధర లీటర్ కు రూ.100 దాటింది. ఇది లీటర్ కు రూ.190 వరకూ వెళుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ వెర్షన్లకు బదులుగా ఆల్టర్నేట్ వెర్షన్లు ఏం ఉన్నాయన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకూ ఇ-కార్లు ఏవీ చౌక ధరల్లో లేవు. కనీసంగా 14 లక్షల షోరూమ్ ధర నుంచి ఇవి మొదలవుతున్నాయి. ఇక ఆడి లాంటి బ్రాండ్ కొనాలంటే అందుకు చాలా రెట్లు అధికంగా ధరలు చెల్లించాలి. అందుకే ఇప్పటివరకూ ఇ-కార్ల సేల్ వేగంగా పెరగలేదని ఓ సర్వే. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ బైక్ ల సేల్ శరవేగంగా సాగుతోంది. ఓవైపు ప్రభుత్వాలు తమ అధికారులు ఉద్యోగుల కోసం ఇ- స్కూటర్లు కొనాల్సిందిగా రూల్ పెట్టడంతో వీటి సేల్ పెరిగింది. ఇక ఇ- ఛార్జింగ్ ఫెసిలిటీ మునుముందు పెరగనుందని సమాచారం. తాజాగా కియరా ఆడి ఇ-కార్ ఫీచర్స్ గురించి వర్ణిస్తూ ఉన్న ప్రకటన అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఇక కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితంపై తెరకెక్కిన బయోపిక్ షేర్షాలో కియరా కథానాయిక . ఈ మూవీ నుండి తాజా అప్ డేట్ ని చిత్రనిర్మాత కరణ్ జోహార్ గురువారం పంచుకున్నారు. ఆగస్టు 12 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. షెర్షా ట్రైలర్ జూలై 25 న విడుదల కానుంది. విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. జూలై 2 న థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా ప్లాన్ ని ఫ్లాప్ చేసింది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా పాత్రతో పాటు కియరా అద్వాణీ రోల్ అంతే ఇంట్రెస్టింగ్ గా సాగనుందని సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్ - కాష్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన షెర్షా కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా (పివిసి) జీవితం ఆధారంగా రూపొందించారు. ఇది సిద్దార్థ్‌ను పరం వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రాగా ఆవిష్కరిస్తుంది. కార్గిల్ యుద్ధ సమయంలో కెప్టెన్ బాత్రా కీలకమైన శిఖరం పాయింట్ 4875 వద్ద తన జీవితాన్ని త్యాగం చేయడంలో కీలకపాత్ర పోషించారు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి అతడిని సైనికుల్లో కొందరు షేర్ షా అని పిలిచారు. అదే ఈ మూవీ టైటిల్ గా మారింది.
సిధార్థ్ - కియారాతో పాటు ఈ చిత్రంలో శివ్ పండిట్- రాజ్ అర్జున్- ప్రణయ్ పచౌరి- హిమ్మన్షు అశోక్ మల్హోత్రా- నికితిన్ ధీర్- అంకితా గోరాయ- అనిల్ చరంజీత్- సాహిల్ వైద్- షాతాఫ్ ఫిగర్- పవన్ చోప్రా కూడా కీలక పాత్రల్లో నటించారు.