Begin typing your search above and press return to search.

అండ‌ర్ వాట‌ర్ లో కియారా బికినీ అందాలు!

By:  Tupaki Desk   |   4 Aug 2022 2:30 PM GMT
అండ‌ర్ వాట‌ర్ లో కియారా బికినీ అందాలు!
X
కియారా అద్వాణీ కిల్ల‌ర్ ఫోజుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఎలాంటి వేర్ లో? కనిపించినా అక్క‌డ అగ్గి రాజుకోవాల్సిందే. అందులోనూ బికినీ దుస్తుల్లో కియారా? క‌నిపించిందంటే! మ‌రింత సంచల‌నం ఖాయం. స్విమ్మింగ్ పూల్ న‌డిబొడ్డునైనా... స‌రిగ్గా సెంట‌ర్ లో అయినా కియారా అందాల‌న్నీ కెమెరా లో బంధీ కావాల్సిందే.

అంత‌గా అమ్మ‌డు క్యామ్ కి బ్యూటీ కోప‌రేట్ చేస్తుంది. పూల్ వాట‌ర్ బేబిగా కియారాకి మంచి ఐడెంటిటీ సంపాదించింది. ఇప్ప‌టికే పూల్ మ‌ద్య భాగం నుంచి టాప్ యాంగిల్ లో ఎన్నోసార్లు అందాలు క‌వ‌ర్ చేసి యువ‌త గుండెల్లో గుబులు పుట్టించింది. అందాల‌న్ని వాట‌ర్ తోనే ఎంత‌గా త‌న్మయం చెందాయో చెప్ప‌క‌నే చెప్పింది.

తాజాగా బ్యూటీ మ‌రోసారి పింక్ క‌ల‌ర్ టూపీస్ లో అగ్గిరాజేసింది. స్విమ్మింగ్ పూల్ లో మునిగిన‌ గ‌ట్టుపై కూర్చుని వీపు అందం స‌హా వాట‌ర్ లో మునిగిన అందాల్ని సైతం ఆవిష్క‌రించింది ఇలా. రెండు క‌ళ్లు మూసుకుని పెదాల‌పై స‌న్న‌ని చిరు న‌వ్వుతో క‌నిపిస్తున్న హాట్ ఫోజుకి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.

అమ్మ‌డి అందంలో త‌డిసి ముద్ద‌వ్వాల్సిందే. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైరల్ గా మారింది. కియారా అభిమానులు హాట్ కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు.

కియారా అద్వాణీ సినిమాల విష‌యానికి వ‌స్తే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది చ‌ర‌ణ్ కి 15వ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. పాన్ ఇండియా కేట‌గిరిలో సినిమా రిలీజ్ కానుంది. అలాగే గ‌తంలో చ‌ర‌ణ్ న‌టించిన 'విన‌య విధేయ రామ‌'లో న‌టించిన విష‌యం తెలిసిందే.

ఇక బాలీవుడ్ లోనూ అమ్మ‌డి కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతుంది. గ‌తేడాది చివ‌ర్లో రిలీజ్ అయిన 'షేర్ షా'..ఇటీవ‌లే రిలీజ్ అయిన 'భూల్ భులైయ్యా-2' తో వ‌రుస విజ‌యాలు ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం విక్కీ కౌశ‌ల్ హీరోగా న‌టిస్తోన్న 'గోవింద నామ్ మేరా'లో న‌టిస్తోంది. శశాంక్ కైథాన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.