Begin typing your search above and press return to search.
గిల్టీతో మరోసారి అందరిని మెప్పించిన కియారా
By: Tupaki Desk | 7 March 2020 9:35 AM GMTక్రేజీ బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని మెయిన్ స్ట్రీమ్ హిందీ సినిమాల్లో నటిస్తూనే వెబ్ సీరీస్ లోనూ.. వెబ్ మూవీస్ లోనూ నటిస్తూ ఈ జెనరేషన్ హీరోయిన్ అనిపించుకుంటోంది. గతంలో కియరా నెట్ ఫ్లిక్స్ వారి 'లస్ట్ స్టోరీస్' లో నటించి వైబ్రేటర్ సీన్ తో అందరికీ కరెంట్ షాక్ ఇచ్చింది. తాజాగా కియారా 'గిల్టీ' అనే మరో వెబ్ చిత్రంలో నటించింది. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
'గిల్టీ' కథాంశం.. అందులో కియారా నటన ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ సినిమా కథలో 'మీటూ' ఉద్యమం.. తదనంతర పరిణామాలదే కీలక పాత్ర. ఈ సినిమాలో కియారా గురు ఫతే సింగ్ కు ప్రియురాలి పాత్రలో నటించింది. ఇద్దరి లవ్ స్టోరీ సాఫీగా నడుస్తున్న సమయంలో #MeToo ఉద్యమం ఊపందుకుంటుంది. ఈ ఉద్యమం చూసి అకాంష రంజన్ కపూర్ ధైర్యంగా గతంలో తనపై అత్యాచారం జరిగిందని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తుంది. ఆ రేపిస్ట్ వేరెవరో కాదు.. కియారా బాయ్ ఫ్రెండ్ గురుఫతే సింగ్. దీంతో కియారాకు కాలి కింద భూమి కంపిస్తుంది.
తన ప్రియుడిపై వచ్చిన ఆరోపణలు నమ్మాలా వద్దా అనే ఆలోచనలతో సతమతమవుతుంది. ఒకవైపు గురుఫతే సింగ్ లాయర్ తాహెర్ షబ్బీర్ తన క్లయింట్ ను గెలిపించేందుకు అవసరమైన సాక్ష్యాలను సేకరిస్తూ ఉంటే మరోవైపు కియరా వాస్తవం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓ సంక్లిష్టమైన కథ.. ఈ తరం ప్రేక్షకులను కట్టిపడేసే కథనంతో సినిమాను తెరకక్కించారని డైరెక్టర్ రుచి నారాయణ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. కియారా కూడా నాన్కీ దత్తా పాత్రలో చక్కని నటన కనబరిచినందుకు మెచ్చుకుంటున్నారు. మొత్తానికి కియారా మరోసారి జనాలు క్లీన్ బౌల్డ్ చేసినట్టే!