Begin typing your search above and press return to search.

నిర్మాతలకు షాక్ ఇచ్చిన కియారా

By:  Tupaki Desk   |   14 Jan 2019 8:13 AM GMT
నిర్మాతలకు షాక్ ఇచ్చిన కియారా
X
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమానే సూపర్ స్టార్ ది కావడం.. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అమ్మడికి టాలీవుడ్ లో డిమాండ్ ఫుల్లుగా ఉంది. ఈమధ్యే కియారా సెకండ్ తెలుగు సినిమా 'వినయ విధేయ రామ' కూడా రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే ఈ భామ రెమ్యూనరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ అయింది.

దర్శకుడు సంపత్ నంది గతంలో గోపీచంద్ హీరోగా 'గౌతమ్ నందా' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా సంపత్ మరోసారి గోపీచంద్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో గోపిచంద్ సరసన హీరోయిన్ గా కియారా అద్వాని ని తీసుకుందామని అనుకున్నారట. ఫైనలైజ్ చేసుకునేందుకు సంప్రదింపులు జరిపితే రూ. 1.25 కోట్లు రెమ్యూనరేషన్ కోట్ చేసిందట. దీంతో నిర్మాతలు షాక్ తిన్నారట.

మరి కియారా అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చి ఆమెను హీరోయిన్ గా ఫైనలైజ్ చెసుకుంటారా లేదా వేరే హీరోయిన్ ను తీసుకుంటారా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కియారా కు బాలీవుడ్ లో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' కాగా రెండోది కరణ్ జోహార్ ఫిలిం. అందుకే రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదట!