Begin typing your search above and press return to search.

క‌న్న‌డ స్టార్ హీరో నెవ‌ర్ గీవ్ అప్ స్టోరీ!

By:  Tupaki Desk   |   17 Jun 2022 2:47 AM GMT
క‌న్న‌డ స్టార్ హీరో నెవ‌ర్ గీవ్ అప్ స్టోరీ!
X
ప్ర‌తీ ఒక్క‌రికి ఎంత క‌ష్ట‌మైనా.. ఎంత క‌ష్ట‌మైనా అనుకున్న‌ది సాధించాల‌ని, త‌న‌కు న‌చ్చి వారిని క‌ల‌వాల‌ని ఓ పెద్ద లిస్ట్ నే రెడీ చేసుకుంటారు. అందు కోసం ఎక్క‌డిదాకైనా వెళ్లాల‌ని.. ఏ విష‌యంలో రాజీప‌డ‌కుండా ఎంత క‌ష్ట‌మైనా గీవ్ అప్ చేయ‌కూడద‌ని భావిస్తుంటారు. ఇక సినీ స్టార్ల‌కైతే దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అసాధ్యం అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేసుకుంటూ వుంటారు. అయితే క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు మాత్రం గ‌త కొన్నేళ్లుగా తీర‌ని కోరిక ఒక‌టి అలాగే వుండి పోయిందట‌.

ఏళ్లు గ‌డుస్తున్నా ఈ హీరో కోరిక మాత్రం ఇప్ప‌టికి నెర‌వేర‌డం లేద‌ట‌. ఆ స‌మ‌యం ఎప్పెడెప్పుడు వ‌స్తుందా? అని చాలా ఏళ్లుగా కిచ్చా సుదీప్ ఎదురుచూస్తున్నాడ‌ట‌. అయితే ఎప్ప‌టికైనా ఆ కోరిక‌ను నెర‌వేర్చుకుంటానని, ఓర్పుతో ఎదురుచూస్తాన‌ని, గీవ్ అప్ అస‌లే చేయ‌న‌ని అంటున్నారాయ‌న‌. ఇంత‌కీ ఆయ‌న తీర‌ని కోరిక ఏంటో తెలుసా?.. ఎందు కోసం.. ఎవ‌రి కోసం ఆయ‌న ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నారో తెలుసా? బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌.

కాజోల్ బాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. త‌ను న‌టించి ల‌వ్ స్టోరీస్ దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యాయి. ఇందుకు కాజోల్ న‌టించిన `దిల్ వాలే దుల్హ‌నియా లేజాయేంగే` మూవీనే ఇందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమాతో వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజోల్ 1999లో హీరో అజ‌య్ దేవ‌గ‌న్‌ని వివాహం చేసుకుని తాత్కాలికంగా సినిమాల‌కు దూర‌మైంది.

ఆ త‌రువాత వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ వ‌చ్చిన కాజోల్ ..అజ‌య్ తో క‌లిసి `తానాజీ`లో న‌టించింది. ఇదిలా వుంటే గ‌త కొంత కాలంగా కాజోల్ తో సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్న క‌న్న‌డ హీరో సుదీప్ తాజాగా కాజోల్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌న లేటెస్ట్ మూవీ `విక్రాంత్ రోణా` రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతున్న‌ సంద‌ర్భంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కాజోల్ తో న‌టించే అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాన‌ని, ఆ ఛాన్స్ ని ఎట్టిప‌రిస్థితుల్లో వ‌తులు కోన‌ని స్ప‌ష్టం చేశాడు. అంతే కాకుండా త‌న‌తో క‌లిసి న‌టించ‌డం త‌న డ్రీమ్ అని చెప్ప‌డం ఆస‌క్తి క‌రంగా మారింది.

అయితే ఇటీవ‌ల భాషాకు సంబంధించిన డిబేట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా సుదీప్‌కు, అజ‌య్ దేవ్‌గ‌న్ కు మ‌ధ్య వార్ న‌డిచింది. ఈ నేప‌థ్యంలో మీ డ్రీమ్ నెర‌వేరేనా అని బాలీవుడ్ మీడియా అడిగితే `నా హోప్ ని ఎప్ప‌టికీ గీవ్ అప్ చేయ‌న‌ని, ఆ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వుంటాన‌ని స్ప‌ష్టం చేయ‌డం విశేషంగా చెబుతున్నారు.