Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్‌కు క‌న్న‌డ హీరో కండీష‌న్‌?

By:  Tupaki Desk   |   29 July 2022 12:30 PM GMT
పాన్ ఇండియా స్టార్‌కు క‌న్న‌డ హీరో కండీష‌న్‌?
X
క‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్ న‌టింటిచిన యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ `విక్రాంత్ రోణ‌`. క‌న్న‌డ మూవీ `కేజీఎఫ్‌` దేశ వ్యాప్తంగా సీరిస్ సినిమాల‌తో సంచ‌ల‌నం సృష్టించడంతో ఆ మూవీ త‌ర‌హాలోనే త‌న సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా ఆక‌ట్టుకుంటుంద‌ని కిచ్చా సుదీప్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న మేవీ ఇది.

అనిల్ బండారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ గురువారం ఐదు భాష‌ల్లో విడుద‌లై తీవ్ర నిరాశ ప‌రిచింది. స‌రైన కంటెంట్ లేక‌పోవ‌డం, విజువ‌ల్స్ తో నెట్టుకురావాల‌ని ప్ర‌య‌త్నించ‌డంతో `విక్రాంత్ రోణ‌` ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్టలేక‌పోయింది.

ఇదిలా వుంటే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో కిచ్చా సుదీప్ హైద‌రాబాద్ టు ముంబై.. ఇలా పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం వెళ్లారు. ఈ సంద‌ర్బంగా ప‌లు మీడియాల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పై సంచ‌ల‌న కామెంట్ లు చేశారు.

అంతే కాకుండా ఆయ‌కు ఓ కండీష‌న్ కూడా పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించ‌డానికి మీరు సిద్ధ‌మేనా అని అడిగితే తాను సిద్ధ‌మేన‌ని తెలిపారు.

అయితే ఇందుకు ఓ కండీష‌న్ ని కూడా పెట్టార‌ట‌. ప్ర‌భాస్ చాలా స్వీట్ ప‌ర్స‌న్‌. త‌న‌ని ఒక్క‌సారి మాత్ర‌మే క‌లిశాను. త‌న‌తో క‌లిసి న‌టించే క‌థ కుదిరితే ఖ‌చ్చితంగా న‌టిస్తాను. అయితే ఓ కండీష‌న్ విల‌న్ పాత్ర‌లో మాత్రం న‌టించ‌ను. కొన్ని సినిమాల్లో విల‌న్ గా న‌టించాను. అయితే ఆ పాత్ర‌లో గ్రే షేడ్ క్యారెక్ట‌ర్ చేయ‌డం నాకు ఇష్టం వుండ‌దు. నేను ఎప్ప‌టికీ హీరోగా న‌టించ‌డానికి మాత్ర‌మే ఇష్ట‌ప‌డ‌తాను. `ద‌బాంగ్ 3`లో మాత్ర‌మే ఔట్ అండ్ ఔట్ విల‌న్ పాత్ర‌లో న‌టించాను. అది కూడా స‌ల్మాన్ ఖాన్ కోస‌మే చేశాను.

ఆ పాత్ర‌ని త‌న కోస‌మే చేశాను. కార‌ణం సినిమాలో ఇద్ద‌రి పాత్ర‌లు స‌మానంగా వుంటాయి కాబ‌ట్టి. మ‌రొక హీరో అయితే ఖ‌చ్చితంగా నో అని చెప్పేవాడిని` అంటూ చెప్పుకొచ్చారు. అంటే ప్ర‌భాస్ తో క‌లిసి సినిమా చేయాల‌ని వుంది.. అయితే అది విల‌న్ పాత్ర అయివుండ‌కూడ‌దు. పైగా త‌న‌తో స‌మానంగా వుండే పాత్ర అయితే ఓకే అంటూ కిచ్చా సుదీప్ కండీష‌న్ పెట్ట‌డం విశేషం. ఇదిలా వుంటే ప్ర‌భాస్ న‌టించిన `బాహుబ‌లి` మూవీలో కిచ్చా సుదీప్ అస్లామ్ ఖాన్ పాత్ర‌లో చిన్న గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.