Begin typing your search above and press return to search.

ప‌హిల్వాన్ తో పెట్టుకుంటే పిడిగుద్దులే

By:  Tupaki Desk   |   25 July 2019 10:25 AM GMT
ప‌హిల్వాన్ తో పెట్టుకుంటే పిడిగుద్దులే
X
`ఈగ` ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `ప‌హిల్వాన్‌`. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. సునీల్ శెట్టి- ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో కిచ్చా సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డ‌- తెలుగులో ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న విడుద‌ల చేయనున్నారు. తాజా పోస్ట‌ర్ లో ప‌హిల్వాన్ టీమ్ రిలీజ్ తేదీని ప్ర‌క‌టించింది.

ఇటీవ‌ల సుదీప్ సినిమాలేవీ తెలుగులో రిలీజ్ కాలేదు. అయితే `కె.జి.య‌ఫ్‌` చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసిన వారాహి చ‌ల‌న చిత్రం `ప‌హిల్వాన్‌` చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌టం ఆస‌క్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రాన్ని త‌మిళం- హిందీ-మ‌ల‌యాళంలోనూ భారీగా రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో టీమ్ ఉందిట‌.

ఇటీవ‌లే `ప‌హిల్వాన్` తొలి పోస్ట‌ర్ రాగానే బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ప్ర‌శంస‌లు కురిపించారు. మేం మొద‌లు పెట్టిన‌ది నువ్వు మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లావు.. ప‌హిల్వాన్ ఆల్ ది బెస్ట్!! అంటూ స‌ల్మాన్ ప్ర‌శంసించారు. సామాజిక మాధ్య‌మాల్లో స‌ల్మాన్ కి సుదీప్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. స‌ల్మాన్ - సోనాక్షి జంట‌గా ప్ర‌భుదేవా తెర‌కెక్కిస్తున్న ద‌బాంగ్ 3లో కిచ్చా సుదీప్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే సుదీప్ ప‌హిల్వాన్ కి స‌ల్మాన్ ప్ర‌మోష‌న్ అస్సెట్ గా మారింది. అలాగే తెలుగులో `సైరా- న‌ర‌సింహారెడ్డి`లోనూ సుదీప్ న‌టిస్తున్నారు కాబ‌ట్టి ప‌హిల్వాన్ కి మెగాస్టార్ ప్ర‌చార సాయం ద‌క్క‌నుంద‌న‌డంలో సందేహం లేదు.