Begin typing your search above and press return to search.

అభిమాన హీరో కోసం భ‌ర్త‌నే బెదిరించింద‌ట‌

By:  Tupaki Desk   |   11 Dec 2019 6:59 AM GMT
అభిమాన హీరో కోసం భ‌ర్త‌నే బెదిరించింద‌ట‌
X
క‌న్న‌డ హీరో సుదీప్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ర‌క్త చ‌రిత్ర‌ తో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన సుదీప్ ఆ త‌ర్వాత ఈగ‌.. బాహుబ‌లి ది బిగినింగ్ లాంటి భారీ సినిమాల్లో న‌టించాడు. ఇటీవ‌లే సైరా న‌ర‌సింహా రెడ్డి లోనూ కీల‌క పాత్ర పోషించాడు. టాలీవుడ్ లో అత‌డు న‌టించిన ప్ర‌తి పాత్ర ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వే. ఇక నిత్యా మీన‌న్ తో సుదీప్ ఎఫైర్ క‌హానీ గురించి తెలిసిందే. అప్ప‌ట్లో సుదీప్ పేరు ప్ర‌ముఖంగా మీడియా లో హైలైట్ అయ్యింది. ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అప్ప‌టికే భార్య‌ కు విడాకులిచ్చి సుదీప్ నిత్యా కోసం సాహ‌సం చేస్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. దీంతో సుదీప్ పేరు మ‌రోసారి మార్మోగి పోయింది.

తాజాగా సుదీప్ ని త‌న భార్య బెదిరించింద‌ట‌. అది కూడా మ‌రో హీరో కోసం ఇలా చేసిందిట‌. ఈ విష‌యం సుదీప్ స్వ‌యం గా ఓ ఇంట‌ర్వూ లో వెల్ల‌డించాడు. ఒక సినీహీరో పై అభిమానం తో త‌న భ‌ర్త అయిన హీరో గారినే భార్యామ‌ణి బెదిరించ‌డానికి కార‌ణం ఏమిటో ఆరాతీస్తే...ఓ షాకింగ్ మ్యాట‌ర్ తెలిసింది. సుదీప్ భార్య‌ హృతిక్ కు వీరాభిమాని అట‌. అత‌డి సినిమాల్ని మొద‌టి ఆట‌కే చూసేయాలి. అస్స‌లు మిస్ చేయ‌ద‌ట‌. సుదీప్ సినిమాలనే త‌క్కువ చేసేంత ఇష్టం హృతిక్ పై ఉందిట‌. ఒక‌వేళ హృతిక్ తో సుదీప్ సినిమా చేస్తే త‌న కంటే ముందుగా ఆ సినిమా సెట్స్ లో త‌న భార్యే ఉంటుంది అంటూ సుదీప్ న‌వ్వేశాడు.

త‌న భార్య‌ కోసమే హృతిక్ నటించిన మొదటి సినిమా `కహో నా ప్యార్ హై` పది సార్లు చూశానని తెలిపాడు. క‌హోనా ప్యార్ హై రిలీజ్ స‌మ‌యం లోనే నేను షూటింగ్ బిజీ వ‌ల్ల‌ సినిమాకి తీసుకెళ్ల‌ లేద‌ని బెదిరించింది. నేనూ సీరియ‌స్ అయ్యే స‌రికి త‌న స్నేహితుల‌ తో క‌లిసి ఆ సినిమాకి వెళ్లింద‌ని సుదీప్ తెలిపాడు. భార్య కార‌ణం గా హృతిక్ డ్యాన్స్ ల‌ కు త‌ను పెద్ద వీరాభిమానిగా మారిపోయాన‌ని సుదీప్ ఇంట‌ర్వూ లో వెల్ల‌డించాడు.