Begin typing your search above and press return to search.

హాలీవుడ్ లో ఈగ విలన్

By:  Tupaki Desk   |   28 Dec 2017 8:31 AM GMT
హాలీవుడ్ లో ఈగ విలన్
X
ఈ మధ్య కాలంలో చాలా మంది నటి నటులు బాషా బేధం లేకుండా నటించేస్తున్నారు. క్యారెక్టర్ నలుగురికి నచ్చుతుంది అంటే చాలు సపోర్టింగ్ క్యారెక్టరా లేక విలన్ క్యారెక్టర్ అని అస్సలు చుడటం లేదు. నటుడిగా అన్ని రుచులను చూడాలని ఇష్టంగా ఇతర భాషల్లో నటించడానికి ఒకే చెప్పేస్తున్నారు. అలా నటిస్తే వారి మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక చిన్న ఇండస్ట్రీలో ఉన్న నటి నటులు కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో అవకశాలను దక్కించుకుంటున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే సౌత్ లో పాపులర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సుదీప్ ఇప్పుడు హాలీవుడ్ ఛాన్స్ పెట్టేశాడు. రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా సుదీప్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత రాజమౌళి ఈగ సినిమాలో విలన్ రోల్ చేసి సౌత్ లో పాపులర్ అయ్యాడు. సుదీప్ కన్నడలో పెద్ద సూపర్ స్టార్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే రీసెంట్ గా హాలీవుడ్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

యాక్షన్ డ్రామా తరహాలో తెరకెక్కబోయే ఆ సినిమాకు ఆస్ట్రేలియన్ ఫిల్మ్ మేకర్ ఈడీ ఆర్య దర్శకత్వం వహించబోతున్నాడు. సుదీప్ ఆ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రష్యాలో జరిగే ఒక భారీ విస్ఫోటనం పేలుడుపై సినిమా కథ నడుస్తుందట. ఆ బ్లాస్ట్ వేలాది మంది జీవితాలను వికలాంగులను చేస్తుందట. సుదీప్ హై ఓల్టేజ్ పాత్రలో కనిపించనున్నాడని అలాగే యాక్షన్ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయని తెలిసింది. ప్రస్తుతం సుదీప్ ఓ కన్నడ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా అయిపోగానే సమ్మర్ లో స్టార్ట్ కాబోయే ఆ హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.