Begin typing your search above and press return to search.
ఏం కిక్కో ఏంటో.. 10 కోట్లు తప్పదట
By: Tupaki Desk | 27 Aug 2015 4:20 AM GMTమాస్ మహరాజ్ రవితేజ ఈసారి ఫెయిలయ్యాడు. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాపయ్యాడు. కిక్ 2కి ఆరంభం నుంచే ఫ్లాప్ టాక్ వచ్చేసింది కాబట్టి ఆ ఫలితం బాక్సాఫీస్ వద్ద కనిపించింది. ఈ సినిమా వీకెండ్ నాటికి కేవలం 14కోట్లు మాత్రమే ఆర్జించింది. ఏపీ, నైజాం కలుపుకుని వచ్చిన మొత్తమిది. ఈ సినిమాకి దాదాపు 10కోట్లు నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్నున్నారు.
మరో వైపు కిక్2 కంటే మూడు వారాలు ముందే రిలీజైన శ్రీమంతుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది. 19రోజుల్లో ఈ సినిమా దాదాపు 53కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 19 రోజుల్లో 76కోట్ల షేర్ వసూలైందని రిపోర్ట్ వచ్చింది. కిక్ 2 షేర్ వసూళ్ల వివరాలిలా ఉన్నాయి. తూ.గో 1.29కోట్లు, ప.గో 86లక్షలు, కృష్ణ 89లక్షలు, వైజాగ్ 98లక్షలు, నెల్లూరు 44లక్షలు, గుంటూరు 1.1కోట్లు, సీడెడ్ 2.09కోట్లు, నైజాం 5.4కోట్లు .. వసూలైంది. రవితేజ కెరీర్ లోనే కిక్ 2 పెద్ద ఫ్లాప్ అంటూ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు.
ఏ యాంగిల్ లో చూసినా కూడా ఓ 10 కోట్లు నష్టం రాకమానదని ఓ అంచనా. సర్లేండి.. పటాస్ సినిమాలో వచ్చిందంతా పాపం కళ్యాణ్ రామ్ ఇక్కడ లాస్ అవుతాడనమాట. ఇక సినిమా బిజినెస్ అంటే అంతేగా.. ఒకచోట వస్తే మరొకచోట దెబ్బతింటుంది. సో, మనోడు పెద్దగా వర్రీ అవ్వకపోవచ్చేమో. కాని వరుసగా హిట్లు తీస్తాడేమో అనుకుంటే రేసుగుర్రం తరువాత సురేంద్ర రేడ్డి ఇలా చేశాడేటి??