Begin typing your search above and press return to search.

కిక్-2 ఎందుకు డిజాస్టర్ అంటే..

By:  Tupaki Desk   |   24 Sep 2015 7:30 AM GMT
కిక్-2 ఎందుకు  డిజాస్టర్ అంటే..
X
ఈ ఏడాది తెలుగులో అత్యంత ఆసక్తి రేపిన పెద్ద సినిమాల్లో కిక్-2 ఒకటి. కళ్యాణ్ రామ్ తొలిసారి తన బేనర్ లో వేరే హీరోతో నిర్మించిన సినిమా.. రవితేజ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా.. ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా.. ఇన్ని ప్రత్యేకతలున్న సినిమా చివరికి దారుణమైన ఫలితాన్నిచ్చింది. సినిమా హిట్టయితే.. కలెక్షన్ల లెక్కలు ఘనంగా ప్రకటించుకుంటారు నిర్మాతలు. కానీ ఫ్లాప్ అయితే ఆ లెక్కలు ఎవరికీ పట్టవు. కిక్-2 వసూళ్ల గురించి కూడా ఎవరికీ పట్టలేదు. నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా దాని గురించి ఒక్క ప్రకటనా చేయలేదు. దర్శకుడు కూడా సైలెంటైపోయాడు. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం కిక్-2 ఫుల్ రన్ లో సరిగ్గా రూ.20.25 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. గ్రాస్ రూ.34.15 కోట్లు.

రూ.20 కోట్లు వసూలు చేసిన సినిమాను డిజాస్టర్ అనడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మింది రూ.30.25 కోట్లకు. అంటే బయ్యర్లకు రూ.10 కోట్ల నష్టమన్నమాట. దాదాపుగా ప్రతి ఏరియాలోనూ బయ్యర్లకు నష్టం వాటిల్లింది. తనకు పటాస్ లాంటి హిట్టు సినిమా ఇచ్చాడని.. దిల్ రాజు నైజాం ఏరియాకు రూ. 9 కోట్లు పెడితే.. షేర్ రూ.6 కోట్లే వచ్చింది. సీడెడ్ కు ఓ డిస్ట్రిబ్యూటర్ రూ.4.1 కోట్లు పెట్టుబడి పెడితే వసూలైంది రూ.2.75 కోట్లే. ఆంధ్రా ఏరియా రూ.7.05 కోట్ల షేర్ వచ్చింది. అక్కడ రైట్స్ అమ్మింది రూ.10.35 కోట్లకు. కర్ణాటక బయ్యర్ రూ.80 లక్షలు, యుఎస్ బయ్యర్ రూ.కోటి దాకా నష్టపోయినట్లు అంచనా. మొత్తానికి కిక్-2 మీద పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ నష్టపోయారు. బయ్యర్లే కదా రూ.10 కోట్లు నష్టపోయిందనుకోవడానికేమీ లేదు. కళ్యాణ్ రామ్ అప్పటికే రూ.5 కోట్ల డెఫిషిట్ తో ఉన్నాడు. తర్వాతి సినిమాకు బయ్యర్లకు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టే మొత్తం నష్టం అతనే భరించాల్సి ఉంటుందన్నమాట.