Begin typing your search above and press return to search.

కిక్‌ 2 కి 'ఎ' సర్టిఫికెట్‌, మండే రివైజింగ్‌

By:  Tupaki Desk   |   14 Aug 2015 12:18 PM GMT
కిక్‌ 2 కి ఎ సర్టిఫికెట్‌, మండే రివైజింగ్‌
X
రవితేజ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కిక్‌2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఈనెల 21న సినిమా రిలీజవుతోంది. సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమాకి సెన్సార్‌ బృందం పెద్ద షాకిచ్చింది. ఎన్నడూ లేనిది రవితేజ సినిమాకి 'ఎ' సర్టిఫికెట్‌ జారీ చేసి షాకిచ్చారు.

అయితే దీనిపై కిక్‌ 2 బృందం అసంతృప్తిని వ్యక్తపరుస్తోంది. ఇలా అయితే కష్టం. ఫ్యామిలీ ఆడియెన్‌ థియేటర్లకు రారు. దీనివల్ల ఇబ్బందులు తప్పవు అని భావించిన కిక్‌ టీమ్‌ రివైజింగ్‌ కమిటీ ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సోమవారం రివైజింగ్‌ కమిటీ కిక్‌ 2 చిత్రాన్ని వీక్షిస్తుంది. ఎ సర్టిఫికెట్‌ 'యుఎ'గా మారుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

సురేందర్‌ రెడ్డి 'డబుల్‌ కిక్‌' అంటూ గ్లామర్‌ డోస్‌ పెంచేయడం వల్లే ఇలా జరిగిందా? డబుల్‌ హాట్‌ అప్పియరెన్స్‌ తో రకూల్‌ అదరగొట్టేసిందని అనుకోవాలా? ఎ సర్టిఫికెట్‌ ఎందుకొచ్చినట్టు?