Begin typing your search above and press return to search.

20 నిమిషాల 'కిక్‌'ను కట్ చేశారట

By:  Tupaki Desk   |   22 Aug 2015 11:45 AM GMT
20 నిమిషాల కిక్‌ను కట్ చేశారట
X
మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా నటించిన కిక్‌ 2 నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఎడిటింగ్‌ లోపం, కామెడీలో ఫెయిల్యూర్‌, అనవసర సన్నివేశాలు సినిమాలో పించ్‌ ని దెబ్బ తీశాయన్న విమర్శలొచ్చాయి. అందుకేనేమో ఈరోజు ఏకంగా 20నిమిషాల నిడివి కట్‌ చేసి రీరిలీజ్‌ చేశారని సమాచారం. ఇప్పుడు ద్వితీయార్థంలో క్రిస్ప్‌ నెస్‌ పెరిగి సినిమాలో గ్రిప్‌ కనిపించిందని చెబుతున్నారు.

మాస్‌ మహారాజ్‌ స్టయిల్‌ కి తగ్గట్టే మాస్‌ ఎలిమెంట్స్‌, యాక్షన్‌ మిక్స్‌ చేసి సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిలాస్‌ పూర్‌ నేపథ్యంలో లొకేషన్లు, రకూల్‌ గ్లామర్‌ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ అన్న టాక్‌ వచ్చింది. సినిమాలో ఖలేజా షేడ్స్‌ కొన్ని కనిపించాయన్న టాక్‌ కూడా నడిచింది. ముఖ్యంగా ఇందులో తనికెళ్ల భరణి క్యారెక్టర్‌ ఖలేజాలోని షఫీ పాత్రని తలపించిందని విమర్శకులు పోలికలు చెప్పారు.

రేసుగుర్రం తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది కావడంతో తొలిరోజు ఓపెనింగులు అదిరిపోయాయని రిపోర్ట్‌ వచ్చింది. ఇక వారాంతం వసూళ్ల వివరాలు సోమవారం నాటికి తెలుస్తాయి. వెయిట్‌ అండ్‌ సీ.