Begin typing your search above and press return to search.
పీక్స్ లో కిక్ 2 ప్రమోషన్స్
By: Tupaki Desk | 4 Aug 2015 3:27 PM GMTమాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన కిక్2 ఈనెలాఖరున రిలీజ్ కి వస్తోంది. 27 రిలీజ్ తేదీ ని ప్రకటించారు. ఇకనుంచి ప్రమోషన్ లో స్పీడ్ పెంచేయనున్నారు. జెట్ స్పీడ్ తో ఆడియెన్ లోకి దూసుకెళ్లిపోవడమే లక్ష్యంగా రవితేజ, సురేందర్ రెడ్డి, కళ్యాణ్ రామ్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇదిగో ముందుగా కిక్కిచ్చే ఈ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఆన్ లైన్ లోకి వచ్చిన ఈ పోస్టర్ డిజైన్ చాలా డీసెంటుగా, క్రియేటివ్ గా కనిపిస్తోంది.
60కోట్ల వసూళ్లు తెచ్చే రేసుగుర్రం సినిమాతో బన్నీని టాప్ స్టార్ గా నిలబెట్టిన సూరి కిక్2 ని కూడా అదే రేంజులో నిలబెడతాడనే ట్రేడ్ పండితులంతా ఆశిస్తున్నారు. ప్రమోషన్ లో చెప్పినట్టే డబుల్ కిక్కిచ్చే సినిమా అవ్వాలని రవితేజ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.
బలుపు, పవర్ సినిమాలతో హిట్ కొట్టిన రవితేజ కిక్ 2 చిత్రంతో మరో మెట్టు పైకి ఎక్కుతాడనే ఆశిద్దాం. చిరునవ్వుల మారాజా మాస్ స్టయిల్ లో కొత్తదనం చూపిస్తే కచ్ఛితంగా కిక్2 ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తుంది. కంటెంట్ పరంగా సూరి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాల్సిందే. రేసుగుర్రం అంత ఫ్రెష్ నెస్ తో కిక్కిస్తాడేమో చూడాలి.