Begin typing your search above and press return to search.
సెంటిమెంటు బ్రేక్ చేస్తే ఆ కిక్కే వేరు
By: Tupaki Desk | 20 Aug 2015 3:35 PM GMTహాలీవుడ్డోళ్లు ఒక్కో సినిమాకు ఐదారు సీక్వెల్స్ కూడా తీస్తుంటారు. తొలి భాగాన్ని మించి మలిభాగాలు పెద్ద హిట్టయిన సందర్భాలు బోలెడుతున్నాయి. ఇక బాలీవుడ్ వాళ్లు కూడా సీక్వెల్ కళను బాగానే అందిపుచ్చుకున్నారు. అక్కడ కూడా రెండు, మూడు భాగాలు వస్తుంటాయి. అవి కూడా ఆదరణ పొందుతుంటాయి. కానీ టాలీవుడ్ లో మాత్రం సీక్వెల్ మాటెత్తితే బెంబేలెత్తిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఏ సీక్వెల్ కూడా హిట్టయిన దాఖలాలు లేవు. 90ల్లో వచ్చిన మనీ సినిమాకు సీక్వెల్ గా మనీ మనీ తీస్తే అది ఫ్లాపైంది. ఆ సమయంలోనే వచ్చిన గాయం సినిమాకు దశాబ్దం తర్వాత సీక్వెల్ తీస్తే అదీ దెబ్బ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ కు సీక్వెల్ గా శంకర్ దాదా జిందాబాద్ తీశారు. కానీ హిందీలో హిట్టయిన సీక్వెల్ ఇక్కడ ఆడలేదు. ఆర్య సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఆర్య-2 పరిస్థితీ ఇంతే. చంద్రముఖి, రక్తచరిత్ర సీక్వెల్స్ కూడా ఆడలేదు.
ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో ఓ సీక్వెల్ వస్తోంది. కిక్ సినిమాకు సీక్వెల్ గా కిక్-2 తీశారు. ఐతే సెంటిమెంటు వల్లో ఏమో దీన్ని సీక్వెల్ గా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు సురేందర్ రెడ్డి అండ్ కో. కిక్ కళ్యాణ్ కొడుకు కథ ఇదని.. అంతకుమించి కథ పరంగా ఇందులో ఏ పోలికలూ, కొనసాగింపులూ ఉండవని అంటున్నాడు సురేందర్. ఐతే అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కిక్-2 అని పేరు పెట్టుకున్నాక ఇది సీక్వెల్ అని ఫిక్సయిపోయారు అభిమానులు. ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్రైలర్, ఇతర విశేషాలు చూస్తుంటే సినిమా హిట్టవుతుందని.. సీక్వెల్ సెంటిమెంటును బ్రేక్ చేస్తుందని ఆశిస్తున్నారు. అదే జరిగితే మున్ముందు మరిన్ని సీక్వెల్స్ తెరకెక్కడానికి అవకాశం ఉంటుందన్నమాటే.