Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ లో కిక్ 2 అట్టర్ ఫ్లాప్
By: Tupaki Desk | 25 Aug 2015 5:31 PM GMTమహేష్ శ్రీమంతుడు సుమారు 30లక్షల డాలర్లు వసూలు చేసి ఓవర్సీస్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. బాహుబలి తర్వాత ఈ స్థాయి వసూళ్లు సాధించిన ఏకైక సినిమా ఇదే. అయితే ఇలాంటి రికార్డ్ హిట్ తర్వాత వచ్చిన కిక్2 కనీస వసూళ్లు అయినా సాధించలేక చతికిలబడింది. కిక్ సినిమాతో పోలిస్తే కిక్ 2 ఓవర్సీస్ మార్కెట్ లో డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటికి మూడు లక్షల డాలర్లు .. అంటే 2కోట్లు వసూలు చేసింది. 99 థియేటర్ల నుంచి వచ్చిన వసూళ్లు ఇవి.
కథ, కథనం లేని కిక్2లో రవితేజ నటన కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఇలాంటి ఫలితం ఎదుర్కోవాల్సి వచ్చిందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. కిక్ లో ఉన్న కిక్కు కిక్2లో లేదని అందుకే విదేశీ ప్రేక్షకుల ఆదరణ పొందలేదని అంటున్నారు. కిక్ 2 విషయంలో ఓవర్సీస్ పంపిణీదారులు, బయ్యర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫెయిల్యూర్ ని ఊహించలేదని వాపోతున్నారంతా. శ్రీమంతుడు మూడోవారంలోనూ వసూళ్లు దుమ్ము దులిపేస్తుంటే కిక్ 2 మాత్రం పూర్తిగా చతికిలబడింని సమాచారం.
శ్రీమంతుడు తర్వాత మళ్లీ ఆ స్థాయి వసూళ్లు తెచ్చే సినిమాలుగా రుద్రమదేవి 3డి, అఖిల్ సినిమా, చరణ్ - వైట్ల సినిమా లైన్ లో ఉన్నాయి. లెటజ్ సీ, ఎవరు కొడతారో...