Begin typing your search above and press return to search.
రాంగోపాల్ వర్మకు జాక్ పాట్
By: Tupaki Desk | 22 Jan 2016 3:30 PM GMTఎట్టకేలకు ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాతో మళ్లీ తన ముద్ర చూపించాడు వర్మ. తెలుగులో ఈ సినిమాకు ఓ మోస్తరు కలెక్షన్లే వచ్చినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’తో బాగానే లాభపడ్డాడు. కన్నడలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. భారీగా వసూళ్లు సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను తీసేశాడు వర్మ. తన తండ్రి రాజ్ కుమార్ ను చెరబట్టిన వీరప్పన్ ను చంపే కథ కాబట్టి పర్సనల్ గా తీసుకుని ఈ సినిమాలో నటించిన శివరాజ్ కుమార్ పెద్దగా పారితోషకం కూడా తీసుకోలేదట. మిగతా నటీనటులకు ఇచ్చింది కూడా తక్కువ. ఖర్చు కూడా పెద్దగా అవలేదు. ఐదు కోట్ల లోపు బడ్జెట్ తో సినిమా అవగొట్టేశాడు వర్మ. ఐతే సినిమా పెట్టుబడి మీద నాలుగైదు రెట్లు ఆదాయం తెచ్చిపెడుతున్నట్లు అంచనా.
‘కిల్లింగ్ వీరప్పన్’ శాటిలైట్ రైట్స్ రూ.6 కోట్లు పలుకుతున్నట్లు తెలిసింది. సౌత్ ఇండియాలో పెద్ద నెట్ వర్క్ ఉన్న సన్ టీవీ.. ‘కిల్లింగ్ వీరప్పన్’ తెలుగు - కన్నడ - తమిళ వెర్షన్ల శాటిలైట్ రైట్స్ ను హోల్ సేల్ గా రూ.6 కోట్లకు అడుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లోనే రిలీజైనప్పటికీ.. తమిళంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐతే వీరప్పన్ మీద సినిమా అంటే సౌత్ ఇండియా అంతా ఆసక్తి ఉంది కాబట్టి హోల్ సేల్ గా సినిమాను కొనేయాలని సన్ టీవీ నిర్ణయించింది. సినిమాకు బడ్జెట్ ఎంతయిందో దాని కంటే ఎక్కువే శాటిలైట్ రైట్స్ పలుకుతుండటంతో మరో ఆలోచన లేకుండా సన్ టీవీకి రైట్స్ ఇచ్చేద్దామనుకుంటున్నాడు వర్మ. ఈ చిత్రానికి వాస్తవంగా నిర్మాతలు కన్నడ వాళ్లయినప్పటికీ.. వర్మకు కూడా నిర్మాణంలో వాటా ఉంది.