Begin typing your search above and press return to search.
వీడి అభిమానం పాడుగానూ!
By: Tupaki Desk | 30 Sep 2016 2:44 PM GMTహాలీవుడ్ సినిమాలు ఫాలో అయ్యే వారికి - సోషల్ నెట్ వర్క్స్ లో యాక్టివ్ గా ఉండేవారికి అమెరికన్ హాట్ స్టార్ కిమ్ కర్ధాషియాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! ఆమెకున్న అందం - ఆమె చేసే అంగాంగ ప్రదర్శన.... ఇలా చెప్పుకుంటూపోతే ఎంతైనా ఉంటుంది. ఆమె అందం - ముఖ్యంగా "వెనక సౌందర్యం" గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆమె ఫోటోలపై సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేసేస్తుంటారు అభిమానులు. అయితే ఆమెకు అభిమానులుండరు... అంతా పిచ్చి అభిమానులే ఉంటారు అని అన్నా అతిశయోక్తి కాదేమో!! ప్రస్తుతం అలాంటి ఒక "పిచ్చి" అభిమాని ఆమెను ఇబ్బందిపెట్టే పనికి పూనుకున్నాడు... ఆమె పిరుదులను కిస్ చేసే ప్రయత్నం చేశాడు.
మీరు చదివింది నిజమే... కిమ్ కర్ధాషియాన్ అభిమానో - ఆరాధికుడో - అంతకుమించినా వాడో కానీ... విటాలి సెడక్ అనే వ్యక్తి ఈ పనికి ఒడిగట్టాడు. ఈ మధ్యకాలంలో పారిస్ లో జరిగిన ఒక ఫ్యాషన్ వీక్ కు కిం హాజరైంది. ఈ సమయంలో ఆమె కారు దిగిన వెంటనే చుట్టుముట్టిన బౌన్సర్లను తోసుకుంటూ ఒక వీరాభిమాని ఆమె దగ్గరవరకూ వెళ్లి ఆమె పిరుదులపై ముద్దులు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే తేరుకున్న బౌన్సర్లు ఇతగాడి ఆశలను ఆవిరి చేస్తూ, కళలను చెరిపేస్తూ అతడిని వెనక్కిలాగి - నేలపై పైడేసి చితక్కొట్టేశారు!
ఈ సంఘటనపై కిమ్ కర్ధాషియాన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కాగా... విటాలి సెడక్ కు ఇలాంటి పనులు చేయడం కొత్తేమీ కాదట. గతంలో విల్ స్మిత్ - లియోనార్డో డికాప్రియో - బ్రాడ్ పిట్ లాంటి వారిని కూడా ఇలానే తన పిచ్చి చర్యలతో ఇబ్బంది పెట్టాడట. పబ్లిసిటీ కోసమే ఇతడు ఇలాంటి పనులు చేస్తుంటాడట!! ఎంత పబ్లిసిటీ అయితే మాత్రం మరీ అక్కడే ముద్దు పెట్టుకోవాలా... ఏమో?