Begin typing your search above and press return to search.
కిమ్ `బాడీ` పెర్ ఫ్యూమ్ పిక్స్ ..వైరల్!
By: Tupaki Desk | 27 April 2018 11:04 AM GMTహాలీవుడ్ బ్యూటీ కిమ్ కర్దాషియన్ గురించి సినీ ప్రేమికులు పరిచయం అక్కరలేదు. అందాల ఆరబోతతో పాటు అనేక సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఈ అమ్మడు తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. తన పేరుతో ఓ పర్ ఫ్యూమ్ తయారు చేసి విక్రయించేందుకు కిమ్ రెడీ అయింది. అంతేకాదు, తన శరీరాన్ని పోలి ఉండేలా ఆ పెర్ ఫ్యూమ్ బాటిల్ డిజైన్ ను రూపొందించింది. అయితే, ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఒక ప్రముఖ పెర్ ఫ్యూమ్ బాటిల్ ను కిమ్ కాపీ కొట్టిందని ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆ బాటిల్ ను తాను కాపీ కొట్టలేదని, తన సొంత శరీరాన్ని పోలిన నమూనాతో కొత్త పెర్ ఫ్యూమ్ బాటిల్ ను తయారు చేశామని కిమ్ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కిమ్ కర్దాషియాన్ `బాడీ` పెర్ ఫ్యూమ్..ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి....అన్న రీతిలో కిమ్ కూడా వినూత్న రీతిలో తన పెర్ ఫ్యూమ్ లను మార్కెటింగ్ చేసుకోవాలనుకుంది. అందుకు ఏకంగా తన శరీరాన్ని మోల్డ్ చేసి...అచ్చు తన ఒంపుసొంపులతో ఉండేలా ఆ పెర్ ఫ్యూమ్ బాటిల్ ను రూపొందించింది. తన బాడీ షేపులోనే కొలతల ప్రకారం అఛ్చం అలాగే ఉండేలా మౌల్డ్ కూడా తీసుకుంది. ఆ ఫొటోను కిమ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో, కిమ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే జేన్ పాల్ గాల్టియర్ అనే ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ అదే తరహాలో రూపొందించిన పెర్ ఫ్యూమ్ బాటిల్స్ బాగా ఫేమస్ అని...అవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని కామెంట్లు పెట్టారు. దీంతో, ఆ వ్యాఖ్యలపై కిమ్ స్పందించింది. జేన్ బాటిల్స్ అంటే తనకు కూడా ఇష్టమని, కానీ, తన శరీరపు కొలతలతో చిన్న బాటిల్ ను రూపొందించానని...అది జేన్ కన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుందని కిమ్ వివరణ ఇచ్చుకుంది. ఏది ఏమైనా...తమ చేతిలో ఒదిగిపోయే కిమ్ పెర్ ఫ్యూమ్ (కేకేడీ) బాటిల్స్ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.