Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న యువీ మాజీ లవర్ కామెంట్!

By:  Tupaki Desk   |   12 Jun 2020 12:30 AM GMT
వైరల్ అవుతున్న యువీ మాజీ లవర్ కామెంట్!
X
భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఉత్తమ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యువరాజ్ సింగ్. టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులు.. మాజీ క్రికెటర్లు ఆయన ఆటను గుర్తు చేసుకున్నారు. ‘మిస్‌ యూ యూవీ’ అంటూ సోషల్‌ మీడియాలో ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి యువీ స్పెషల్ థాంక్స్ తెలిపాడు. “ప్రియమైన అభిమానులారా.. మీ ఆప్యాయతకు నేను పొంగిపోయాను. నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. మీరంతా నాలో భాగమైనట్టే నా జీవితంలో క్రికెట్‌ ఎప్పటికీ ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా కరోనా వైరస్‌పై ప్రభుత్వం చెప్పే నియమాలు పాటించండి…”అంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశారు.

అలా పోస్ట్ చేసాడో లేదో ఈ పోస్ట్‌ వెంటనే వైరల్‌ అయింది. అయితే యువీ ఉద్వేగంగా చేసిన ఈ ఇంస్టాగ్రామ్ పోస్ట్‌పై యువి మాజీ ప్రేయసి కిమ్‌ శర్మ స్పందించింది. ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అంటూ కామెంట్‌ చేసింది. అయితే దీని అర్థం తెలియని కొందరు కిమ్ పై సెటైర్స్ వేస్తున్నారు. మరి కొందరు పూర్తిగా రాస్తే ఏమవుతుంది.. అంటూ కామెంట్స్ చేశారు. ఇక కొందరు మాత్రం యువి కిమ్ ల ప్రేమ సంగతులను తవ్వితీశారు. అయితే కిమ్ చేసిన కామెంట్‌పై యూవీ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. మొత్తానికి చాలా కాలం తర్వాత యూవీని కిమ్ విష్ చేయడం.. ఈ సందర్భంగా కిమ్ శర్మ, సిక్సర్ల వీరుడు యూవీల ప్రేమ కథను గుర్తు చేసుకున్నారు అభిమానులు. కిమ్‌ శర్మ తెలుగులో ఖడ్గం సినిమాతో పరిచయం అయింది.