Begin typing your search above and press return to search.

కిమ్ - హర్ష మధ్య ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   9 Sep 2018 10:20 AM GMT
కిమ్ - హర్ష మధ్య ఏం జరుగుతోంది?
X
టైటిల్ లో కిమ్ అనే పేరు చూడగానే 'లిటిల్ మ్యాన్' కిమ్ జోంగ్ ఉన్ అనుకుంటారేమో.. కాదు. టైటిల్ లో ఉన్న కిమ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు అసలు తెలీదు. ఈ కిమ్ బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ. పలు బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో 'ఖడ్గం' లో కూడా నటించింది. ఇక ఈ కిమ్ ఈమధ్య కొత్తగా నటుడు హర్షవర్ధన్ రాణేతో స్నేహం చేస్తోంది. బాలీవుడ్ నటుడైన ఈ హర్షవర్ధన్ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు.

కిమ్-హర్ష ఇద్దరూ చేతిలో చెయ్యేసుకొని ముంబై లోని ఉన్న ఒక బిజీ ఏరియా అయిన జుహూలో ఒక మల్టిప్లెక్స్ లో కనిపించారు. కొంతమందేమో లంచ్ చేయడానికి వచ్చారు అంటున్నారు.. మరికొంతమంది సినిమాకు వచ్చారని అంటున్నారు. ఏదో ఒకటి గానీ.. ఇద్దరూ కలిసి కనబడగానే ఫోటోలు తీసి ఇద్దరి మధ్య ఏదో ఉందని బాలీవుడ్ మీడియా కథలు అల్లేసింది. వాళ్ళేమో అలాంటిది ఏమీ లేదని అంటున్నారు.

మనం కిమ్ సంగతి మాట్లాడుకుంటే కెన్యా బిజినెస్ మ్యాన్ అలీ పుంజానీని పెళ్లి చేసుకుంది కానీ ఇప్పుడు విడిపోయారు. ఆ తర్వాత ఒక హ్యాండ్ సమ్ బాలీవుడ్ మోడల్ తో స్నేహం చేసిందట. ఇప్పుడు కొత్త ఫ్రెండ్ హర్ష. ఇక హర్ష విషయం మాట్లాడుకుంటే మొద్దట గౌహర్ ఖాన్ తో ఫ్రెండ్షిప్.. ఆ తర్వాత గుత్తా జ్వాలా తో దోస్తీ. ఇప్పుడు కిమ్ తో స్నేహం. మరి ఇది జస్ట్ స్నేహమా లేదా తెలియాలంటే మనం కొన్ని రోజులు ఆగాల్సిందే.