Begin typing your search above and press return to search.
అలా ఫ్రీగా కారు వాడేస్తే ఎలాగమ్మా!!
By: Tupaki Desk | 5 April 2018 9:23 AM GMTకిమ్ శర్మ... ఈ బాలీవుడ్ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. టీమిండియా ఆటగాడు యువరాజ్ తో చాలా రోజులు డేటింగ్ చేసిన కిమ్... ఆ తర్వాత అతనితో తెగతెంపులు చేసుకుంది. ఇప్పుడు మరోసారి తేరగా వచ్చిందని లగ్జరీ కారులో షికారులు చేస్తూ వార్తల్లో నిలిచిందీ బాలీవుడ్ బ్యూటీ.
కృష్ణవంశీ ‘ఖడ్గం’ సినిమాలో ‘ముసుగు వేయొద్దు... మనసు మీద అంటూ’... తన అందాలతో కుర్రకారు నిద్రపోకుండా చేసిన భామ. ఆ తర్వాత చాలా రోజులకు రవితేజ ‘ఆంజనేయులు’ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించింది కిమ్. రాజమౌళి ‘మగధీర’ సినిమాలో ‘జోర్ సే... జోర్ సే’ అంటూ స్టెప్పులేసి.. తళ్లుకున్న మెరిసి మాయమైంది. యువీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత అలీ పుంజానీ అనే బిలియనీర్ ని పెళ్లి చేసుకుంది కిమ్. అయితే అతనితో కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. విడాకులు తీసుకుని విడిపోయింది. అయితే తన కారుని ఫ్రీగా వాడేస్తూ... తిరిగివట్లేదని ఆమెపై ఫిర్యాదు చేశాడు దిలీప్ కుమార్ అనే వ్యాపారవేత్త.
దిలీప్ కుమార్ వ్యాపార పనుల నిమిత్తం బిజీగా తిరుగుతుండడంతో తన కారు కిమ్ భర్త ఇంట్లో పార్క్ చేసి వెళ్లాడట. అంతే అప్పటి నుంచి దాంట్లో కిమ్ శర్మ ఇష్టారాజ్యంగా తిరిగేస్తోందట. విషయం తెలిసి మనోడు ‘నా కారు నాకిచ్చేయ్...’ అని అడిగితే...తన భర్త నాకీ కారు ఇచ్చాడు. నీకెందుకిస్తా... అంటూ సమాధానం చెప్పిందట. దాంతో కంగుతిన్న దిలీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దిలీప్‌కి మరాఠీ రాకపోవడంతో కిమ్ శర్మ పేరుకి బదులు ఆమె మాజీ భర్త అలీ పుంజానీ పేరు ఫిర్యాదులో రాశాడట. తర్వాత ఆ తప్పును సరిచేసినా పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదని తెగ బాధపడిపోతున్నాడు. పాపం... దిలీప్ కుమార్!!