Begin typing your search above and press return to search.
కింగ్ ఖాన్ ని అజ్ఞాతవాసి అనేశాడు!
By: Tupaki Desk | 6 Oct 2019 1:30 AM GMTబాలీవుడ్ ఖాన్ లలో ఒకరైన సైఫ్ అలీఖాన్ మీడియా సాక్షిగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వెబ్ సిరీస్ ల బాట పట్టిన సైఫ్ తాజాగా 'లాల్ కప్టాన్' చిత్రంలో నటిస్తున్నారు. నవదీప్ సింగ్ దర్శకత్వంలో సునీల్ లుల్లా- ఆనంద్ ఎల్.రాయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ సాధువుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సైఫ్ నాగ సాధువుగా ఓ టిపికల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సైఫ్ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సైఫ్ తాజాగా షారుఖ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అజ్ఞాత వ్యక్తి అని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ అజ్ఞాత వ్యక్తి భారతీయ సినిమాల్లో రొమాంటిక్ జానర్ ని ఆక్రమించాడని.. ఆ జోనర్ లో చేసిన సినిమాలన్నీ దాదాపు విజయాన్ని సాధించాయని చెప్పుకొచ్చాడు. కెరీర్ తొలి నాళ్లలో షారుక్ ఇదే జోనర్ చిత్రాల్లో నటించి విజయాలు సొంతం చేసుకున్నాడని వెల్లడించాడు.
ఇతర ఇండస్ట్రీల్లో హిట్ అయిన చిత్రాల్ని కాపీ కొట్టడం బాలీవుడ్ కు బాగా అలవాటైపోయింది. `బాజీగర్` సినిమా ఐడియా ఒరిజినల్ కాదు. విదేశాల్లో రూపొందిన ఓ సినిమాకు కాపీ కథ. తన కుటుంబానికి చేసిన ద్రోహానికి ప్రేమని అడ్డు పెట్టుకుని ఓ యుకుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే అసలు కథ. దాన్ని మన వాళ్లు కాపీ కొట్టి తీశారు అని షారుఖ్ సినిమా గాలి తీసేశారు. `కల్ హో నా హో` చిత్రంలో షారుఖ్ తో కలిసి సైఫ్ అలీఖాన్ నటించారు. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా అన్నాడా? అంటూ అభిమానులు కూపీ లాగుతున్నారు. అయితే సైఫ్ ఏదో ఫ్లోలో సరదాగానే బాద్ షాని ఆ మాటన్నారా? స్నేహంలోని చనువుతోనే ఇలా అన్నడా..? అన్నది పరిశీలిస్తే కానీ తెలీదు. మరీ ముఖ్యంగా కింగ్ ఖాన్ ని అజ్ఞాతవాసి అనేశాడేమిటో?!