Begin typing your search above and press return to search.

ఇటు ద‌ళ‌ప‌తి అటు బాద్ షా మ‌ధ్య‌లో కింగ్ మేక‌ర్

By:  Tupaki Desk   |   23 Sep 2022 4:13 AM GMT
ఇటు ద‌ళ‌ప‌తి అటు బాద్ షా మ‌ధ్య‌లో కింగ్ మేక‌ర్
X
ఇటు ద‌క్షిణాదిలో అత‌డికి ద‌ళ‌ప‌తి అండ‌దండ‌లున్నాయి. అటు ఉత్త‌రాదికి వెళితే ఏకంగా బాద్ షా అండ దండ‌లే ద‌క్కాయి. ఇద్ద‌రు స్టార్లు యువ‌ద‌ర్శ‌కుడి కెరీర్ బండిని విజ‌య‌ప‌థంలో న‌డిపేందుకు చుక్కానీలుగా ఉప‌యోగ‌ప‌డుతున్నారు. అంతటి తెలివితేట‌లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. సౌత్ లో ఇత‌ర ద‌ర్శ‌కులెవ‌రికీ లేని రేంజు త‌న‌కు ఉంద‌ని నిరూపిస్తున్నాడు. ఇది నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యం. త‌న‌కు గురువులు అన‌ద‌గ్గ వాళ్లే ఇటీవ‌లి కాలంలో కెరీర్ ప‌రంగా త‌డ‌బ‌డుతుంటే తాను మాత్రం అగ్ర‌హీరోల‌తో కాల్షీట్ల‌ను బ్లాక్ చేస్తూ వ‌రుస చిత్రాలు చేస్తున్నాడు.

అత‌డు ఎవ‌రో చెప్పాల్సిన ప‌ని లేదు. గ్రేట్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ గురించే ఇదంతా. అత‌డు ఏ.ఆర్.మురుగ‌దాస్ శిష్యుడు. శంక‌ర్ వ‌ద్ద అసిస్టెంట్ గా ప‌ని చేసాడు. ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ గా ఇటు ద‌క్షిణాది అటు ఉత్త‌రాదిన చ‌క్రం తిప్పుతున్నాడు. దేశంలో ఇద్ద‌రు నంబ‌ర్ వ‌న్ హీరోల‌ను అత‌డు డైరెక్ట్ చేస్తున్నాడు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ తో వ‌రుస చిత్రాలు తెర‌కెక్కించిన అట్లీ కుమార్ ప్ర‌స్తుతం కింగ్ ఖాన్ షారూఖ్ తో జ‌వాన్ చిత్రీక‌రిస్తున్నాడు. ఇందులో న‌య‌న్ క‌థానాయిక కాగా.. విజయ్ సేతుపతి- దీపికా పదుకొణె కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ లో షారూక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2 జూన్ 2023న విడుదలవుతుంది.

SRK - అట్లీ జోడీ అన‌గానే మూవీపై బ‌జ్ అమాంతం పెరిగింది. ఖాన్ ఫ‌స్ట్ లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. అట్లీ నిన్న తన 36వ పుట్టినరోజును జరుపుకున్నారు. చెన్నైలో పుట్టినరోజు వేడుకల నుండి ఒక చిత్రాన్ని పంచుకోగా.. ఇది ఇంటర్నెట్ ను బ్రేక్ చేసింది.

కింగ్ ఖాన్ షారూక్.. ద‌ళ‌పతి విజయ్ లతో ఒక ఫోటోను అట్లీ షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేయడమే కాకుండా ఇద్దరు గ్రేట్ స్టార్ల‌ మధ్య స్నేహ‌పూర్వ‌క‌ సహకారం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

'జవాన్‌'లో విజయ్ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి తాజా ఫోటోగ్రాఫ్ తో అది నిజమేన‌ని భావించ‌వచ్చు. ఈ స్నాప్ లో ముగ్గురూ బ్లాక్ లో డాషింగ్ గా కనిపించారు. SRK క్యాజువల్ బ్లాక్ టీ-షర్ట్ ధరించ‌గా అట్లీ బ్లాక్ జాకెట్ ధరించారు. విజయ్ బ్లాక్ షర్ట్ ధరించారు.

అట్లీ - షారూఖ్ ఖాన్ ల మూవీ గురించి పుకార్లు మొదట 2019లో వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ ఒకరినొకరు రెండు సార్లు కలుసుకున్నారు. ద‌ళ‌ప‌తి విజయ్ నటించిన బిగిల్ ట్రైలర్ ను 'చక్ దే ఆన్ స్టెరాయిడ్స్' అని పిలుస్తూ SRK షేర్ చేసినప్పుడు అధికారిక ధృవీకరణ వచ్చింది. అంతే కాదు విజయ్ బీస్ట్ హిందీ ట్రైలర్ ను షారూక్ కూడా షేర్ చేశాడు. చివరకు 3 జూన్ 2022న అభిమానుల కోలాహలం మధ్య 'జవాన్‌'ను ప్రకటించారు. ఇది SRK పునరాగమన చిత్రం 'పఠాన్' తర్వాత కొన్ని నెలలకు విడుదలవుతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.