Begin typing your search above and press return to search.
వైల్డ్ డాగ్ః వ్రతం చెడ్డా.. ఫలం దక్కదాయె!
By: Tupaki Desk | 13 April 2021 1:30 AM GMTకింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. గత నవంబరులోనే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. నెట్ ఫ్లిక్స్ లో సంక్రాంతికే స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ.. అప్పుడే థియేటర్లు తెరుచుకోవడం.. ‘క్రాక్’ వంటి చిత్రం భారీ వసూళ్లు సాధించడంతో ‘వైల్డ్ డాగ్’ నిర్మాతలకూ ఆశ కలిగింది. దీంతో.. ఓటీటీ అగ్రిమెంట్ చింపేయడానికి సిద్ధపడ్డారు.
ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ రూ.25 కోట్ల వరకూ ఆఫర్ చేసిందని టాక్. వైల్డ్ డాగ్ అనేది ఒక వర్గం ప్రేక్షకులే ఆదరించే సినిమా. యాక్షన్ ఇష్టపడే వారు మాత్రమే ఈ సినిమాను ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ.. అంత మొత్తం ఆఫర్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఇది కాకుండా.. శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ ఎలాగో ఉంటాయి. దీంతో.. మొత్తంగా 30 కోట్ల చిల్లర వచ్చేసేవి.
అదే జరిగితే.. నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ఉండేది. కానీ.. అవన్నీ కాదనుకొని థియేటర్ లోనే రిలీజ్ చేయడానికి సద్ధమయ్యారు. అప్పుడే చాలా మంది ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. ఓటీటీ నుంచి వదులుకున్న మొత్తాన్ని రాబట్టాలంటే.. కనీసం 50 కోట్ల గ్రాస్ సాధించాలనే లెక్కలు తెరపైకి వచ్చాయి. అయినప్పటికీ.. వాళ్ల లెక్కలు వాళ్లకు ఉంటాయి కాబట్టి.. మొత్తాన్ని థియేటర్ కు తెచ్చారు నిర్మాతలు.
ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలైంది. డబ్బింగ్ సినిమా సుల్తాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న వైల్డ్ డాగ్ కు.. పెద్ద అడ్డంకులు లేవనే చెప్పాలి. అదే రోజున రావాల్సిన గోపీచంద్ ‘సీటీమార్’ కూడా వెనక్కి వెళ్లిపోవడం మరింతగా లాభించే అంశం. కానీ.. ఆశించిన ఫలితం రాలేదు. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అందరూ సినిమా బాగుందన్నారు గానీ.. థియేటర్ లో జనాలు లేరు. ఫలితంగా దారుణమైన కలెక్షన్లు సాధించింది. ఇప్పటి వరకూ కేవలం రూ.4 కోట్ల షేర్ సాధించినట్టుగా తెలుస్తోంది.
దీంతో.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నిర్మాతలది. ఓటీటీలోనే విడుదల చేసుకున్నాపోయేది అని ఇప్పుడు అనుకుంటున్నారు. టేబుల్ ప్రాఫిట్ ను కాదనుకొని.. థియేటర్ కు వచ్చి డిజాస్టర్ గా మిగిలిపోవడం మింగుడు పడట్లేదు. ఓటీటీలో వచ్చే లాభాన్ని కాలదన్నుకొని.. థియేటర్లో బొక్క బోర్లా పడిపోవడంతో.. వ్రతం చెడ్డా ఫలితం దక్కకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.