Begin typing your search above and press return to search.

హీరోగా నన్నిక్కడ నిలబెట్టింది మీరే: కిరణ్ అబ్బవరం

By:  Tupaki Desk   |   15 Sep 2022 4:03 AM GMT
హీరోగా నన్నిక్కడ నిలబెట్టింది మీరే: కిరణ్ అబ్బవరం
X
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన కిరణ్ అబ్బవరం, తనని తాను హీరోగా నిరూపించుకోవడానికి ఒక రేంజ్ లోనే కష్టపడుతున్నాడు. చూడటానికి అమాయకంగా నవ్వుతూ కనిపించే ఈ కుర్రాడు, తెరపై ఒక రేంజ్ లో రెచ్చిపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రూపొందింది. ఈ సినిమాతో కథానాయికలుగా సంజన ఆనంద్ - సోను ఠాకూర్ పరిచయం కానున్నారు. ఈ సినిమా ఈ నెల 16వ తేదీన థియేటర్లకు రానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ స్టేజ్ పై కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. కోడి రామకృష్ణ గారి బ్యానర్లో 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను మీ ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడొచ్చు. మంచి పాటలతో పాటు .. కావలసినంత ఎంటర్టైన్ మెంట్ ఉంది. థియేటర్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ఒక ఎమోషన్ తీసుకుని వెళతారు. ఈ సినిమాలో ఏవుందని చాలామంది అడుగుతున్నారు. ఎంటర్టైన్ మెంట్ ఉంటుందనే నేను చెబుతున్నాను. అప్పట్లో మేమంతా మాకు తోచిన థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేసేవాళ్లం. రివ్యూలు చూసి వెళ్లడమనేది అప్పటికి అలవాటు లేదు.

ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒక్కటే .. సినిమా విషయంలో మీ నిర్ణయం మీరు తెసుకోండి. మీరెళ్లి సినిమా చూడండి .. నచ్చితేనే ఫ్రెండ్స్ కి చెప్పండి. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి సిద్ధార్థ్ మీనన్ పరిచయమవుతున్నాడు.

ఈ సినిమాలో ఆయన చేసిన రోల్ చాలా స్పెషల్ గా ఉంటుంది .. మీకు వెంటనే కనెక్ట్ అవుతుంది. సెకండాఫ్ లో బాబా భాస్కర్ గారి కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ రోజున నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం మీరే. నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు .. నా వర్క్ ను ఎంతమంది అభిమానిస్తున్నారనేది నాకు తెలియదు.

కానీ అందరూ కూడా 'నువ్ బాగా చేస్తున్నావ్ రా' అనే చెప్పేసి నా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. 'ఎస్.ఆర్. కల్యాణ మంటపం' సినిమాతో నాకు మంచి సక్సెస్ ఇచ్చారు.

అప్పటికే నేను చాలా సినిమాలను కమిటయ్యాను .. ఆ సినిమాలను చేస్తూ వస్తున్నాను. ఇకపై కూడా నా నుంచి మంచి సినిమాలు వస్తాయని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేస్తారని మాట ఇస్తున్నాను. ఈ నెల 16వ తేదీన థియేటర్స్ కి వెళ్లి సినిమాను చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.