Begin typing your search above and press return to search.
ఇడుపులపాయ విద్యార్ధులతో కావాల్సినవాడు!
By: Tupaki Desk | 21 Aug 2022 6:30 AM GMTయంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ర్టీలో సక్సెస్ అయిన మరో హీరో. నాని..విజయ్ దేవరకొండ..విశ్వక్ సేన్ తరహాలోనే కిరణ్ తక్కువ టైమ్ లోనే ఎస్టాబ్లిష్ అయ్యాడు. బిగ్ బ్యానర్స్ లో అవకాశాలు అందుకుంటూ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇలా వచ్చి సక్సెస్ అవ్వడం వెనుక ఎన్నో కష్టనష్టాలుంటాయి. వాటన్నింటిని దాటుకుని ముందుకెళ్తేనే గెలుపు గుర్రం ఎక్కగలం. అలాంటి వాళ్లలో కిరణ్ కూడా ఒకరు.
బ్యాక్ గ్రౌండ్ లేదని ఫీలవ్వలేదు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు సక్సెస్ అయ్యాడు. ఇండస్ర్టీలో సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవలే `సమ్మతమే` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ప్రస్తుతం `నేను మీకు బాగా కావాల్సినవాడిని` అంటూ రిలీజ్ కి రెడీ అవు తున్నాడు. దీనిలో భాగంగా చిత్ర యూనిట్ ప్రచారం పనులు వేగ వంతం చేసింది.
ఇప్పటికే రిలీజైన అయిన టీజర్ .. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఈ యంగ్ హీరో కడప జిల్లాలోని ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కళాశాలను సందర్శించారు. చిత్ర బృందానికి అక్కడ అనూహ్యమైన స్పందన లభించింది. విద్యార్ధుల సమక్షంలో సినిమాకి సంబంధించి వివరాలు పంచుకున్నారు.
అలాగే తన కాలేజ్ జీవితం గురించి కిరణ్ గుర్తు చేసుకున్నారు. తమ సినిమాని విద్యార్ధులంతా ఆదరించాలని కోరారు. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత నిర్మిస్తున్నారు. సినిమాపై టీమ్ అంతా కాన్పిడెంట్ గా ఉన్నారు. కిరణ్ మంచి ఎనర్జిటిక్ గా పాత్రతో ప్రేక్షకులు మెప్పిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసారు.
యంగ్ హీరో చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ లు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ .. మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలలో సినిమాలు చేస్తున్నాడు. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకునే నిరంతరం శ్రమిస్తున్నాడు. యంగ్ హీరోకి యువతలో ఇప్పుడిప్పుడే మంచి ఫాలోయింగ్ బిల్డ్ అవుతుంది. ఆ ఫాలోయింగ్ ని ఎన్ క్యాష్ చేసుకునే ఐడియాలజీని వర్కౌట్ చేస్తున్నాడు.