Begin typing your search above and press return to search.
సెబాస్టియన్ షెభాష్ అనిపిస్తేనే లైన్ క్లియర్!
By: Tupaki Desk | 4 March 2022 3:56 AM GMT`ఎస్. ఆర్ కళ్యాణమండపం` చిత్రంతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కి మంచి గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో రిలీజ్ అయిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా పాజిటివ్ టాక్ తో బాగానే ఆడింది. థియేటర్లు పూర్తిగా తెరవని రోజుల్లో రిలీజ్ అయి సక్సెస్ అందుకోవడం తో కిరణ్ కి మంచి పేరొచ్చింది. వసూళ్ల పరంగా కొంత ప్రభావం పడినప్పటికీ పూర్తి స్థాయిలో థియేటర్లు అందుబాటులో ఉంటే మంచి వసూళ్లు సాధించేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. ఆ సినిమాతో ప్రామిసింగ్ హీరోగా కిరణ్ కి మంచి పేరొచ్చింది. దీంతో యంగ్ హీరోకి బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు ఇంటి తలుపుతట్టాయి.
మెగా బ్యానర్ గీతా ఆర్స్ట్ అనుబంధ సంస్థ జీఏ-2లో సైతం కిరణ్ అవకాశం అందుకున్నాడు అంటే అతని ప్రతిభకి తార్కాణంగా చెప్పొచ్చు. `వినరో భాగ్యము విష్ణు కథ` అనే టైటిల్ తో అదే బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకా `సమ్మతమే`..`నేను మీకు బాగా కాలవాల్సిన వాడిని` వంటి మరో రెండు సినిమాలు కూడా ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇలా ఒకేసారి ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు. అయితే వీటన్నింటికి కంటే ముందే `సెపబాస్టియన్ పీసి 524` అనే మరో సినిమా చేసిన సంగతి తెలిసిందే. బాలాజీ సయ్యపు రెడ్డి అనే కొత్త కుర్రాడితో ఈ సినిమా చేసాడు.
ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. టైటిల్ తోనే డిఫరెంట్ కంటెంట్ గల సినిమా అని హైలైట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. దీంతో టీమ్ సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. అన్ని పనులు పూర్తిచేసుకున్న సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రీమియర్ షోలని సైతం యూనిట్ ప్లాన్ చేసుకుందంటే టీమ్ నమ్మకం ఎంత బలంగా ఉందన్నది తెలుస్తోంది. అయితే సెబాస్టియన్ ప్రభావం తదుపరి ఉన్న లైనప్ లపై పడుతుందని తెలుస్తోంది.
సెబాస్టియన్ వసూళ్లు అప్ కమింగ్ రిలీజ్ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెబాస్టియన్ యావరేజ్ గా ఆడినా యంగ్ హీరో గట్టెక్కిపోయినట్లే. కళ్యాణ పండపం క్రేజ్ తో యువత సెబాస్టియన్ వైపు అడుగులు వేసే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఫలితాలు తారుమారు అయితే గనుక సవాళ్లు తప్పవు. అన్ని సందర్భాల్లోనూ గెలుపు నల్లేరు మీద కడక కాదు. మరి యంగ్ హీరో విషయంలో ఎలా జరుగుతుందో చూడాలి.