Begin typing your search above and press return to search.
ట్రైలర్ : అంతా సెబాస్టియన్ కంట్రోల్ లోనే
By: Tupaki Desk | 28 Feb 2022 5:38 AM GMTవిభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతని చాటుకుంటున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. `రాజా వారు రాణివారు` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రతీ సినిమా కొత్తగా వుండేలా అడుగులు వేస్ఉతన్నాడు. తను నటిస్తున్న తాజా చిత్రం `సెబాస్టియన్ పిసి 524`. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రత దరేకర్) హీరోయిన్ లుగా నటిస్తున్నారు. బాలాజీ సమ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్‌టైన్ మెంట్ సమర్పణలో సిద్దారెడ్డి బి, జయచంద్రరెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోమవారం ఉదయం 11 :04 నిమిషాలకు విడుదల చేశారు. `ఓ ఏందన్నా అంతా చీకటిగా వుండాదే అని ఓ వ్యక్తి వాయిస్ తో ట్రైలర్ మొదలైంది.. చీకటా.. వాడాయమ్మా.. అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెబాస్టియన్ ఇక్కడ.. వీచే గాలీ... లేని వెలుతురు.. ఉన్న చీకటీ.. సాక్షిగా.. అంటూ కిరణ్ అబ్బవరం చెబుతుంటే... ఏం చేస్తావో చెప్పురా ... అని ఓ వ్యక్తి అనడం.. డైలాగ్ మీరే ఫ్రేమ్ చేసుకోండన్నా అని కిరణ్ అబ్బవం అంటుండటం నవ్వులు పూయిస్తోంది.
రేచీకటి కారణంగా ఇబ్బందులు పడే ఓ కానిస్టేబుల్ స్టోరీ నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. చిన్నతనం నుంచి తన లోపాన్ని బయటపడనీయకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన ఓ యువకుడికి పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం వస్తుంది. అతని డ్యూటీ కూడా నైట్ చేయాల్సి వస్తుంది. రేచీకటితో బాధపడే హీరో తనని తాను ఎలా కావాడుకున్నాడు. ..ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు అన్నదే ఈ చిత్రా ప్రధాన ఇతివృతం.
జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ కిరణ్ అబ్బవరంగా కు హ్యాట్రిక్ హిట్ ని అందించడం ఖాయంగా కనిపిస్తోందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇటీవలే ఈ చిత్ర ప్రమోషన్స్ ని చిత్ర బృందం ప్రారంభించింది.. ఇటీవల టైటిల్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేశారు. చిత్ర కథని ఎలివేట్ చేస్తూ అర్థవంతమైన పదాలతో సాగిన ఈ పాట ఇప్పటికే నెట్టింట సందడి చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 4న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై క్రేజ్ ఏర్పడటంతో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయినట్టుగా చెబుతున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ - ఆదర్శ్ బాలకృష్ణ - జార్జ్ - సూర్య - మహేష్ విట్టా - రవితేజ - రాజ్ విక్రమ్ - లత - ఇషాన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ - ఫొటోగ్రఫీ రాజ్ కె. నల్లి - ఫైట్స్ అంజి మాస్టర్.