Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి యంగ్ హీరో స‌ర్ ప్రైజ్!

By:  Tupaki Desk   |   9 Jan 2023 9:35 AM GMT
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి యంగ్ హీరో స‌ర్ ప్రైజ్!
X
విభిన్న‌మైన సినిమాల‌తో కెరీర్ లో దూసుకుపోతున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం. త‌ను క‌థానాయకుడిగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌'. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ద్వారా ముర‌ళీ కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. క‌ష్మీర‌ ప‌ర‌దేశి హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 17న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.

రీసెంట్ 'వైబ్ ఆఫ్ విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌'అంటూ గ్లిమ్స్ ని విడుద‌ల చేశారు. స‌రికొత్త నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో గ్లిమ్స్ ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. తాజాగా విడుద‌ల చేసిన 'వాస‌వ సుహాస‌...' అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేస్తే ఇది కూడా యూత్ ని విశేషంగా ఆక‌ట్టుకుని సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. నేప‌థ్యంలో ఈ మూవీ టీజ‌ర్ ని జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇదే రోజున స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన గుణ‌శేఖ‌ర్ మూవీ'శాకుంత‌లం' ట్రైల‌ర్ రిలీజ్ అవుతుండ‌టంతో 'విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌' టీజ‌ర్ ని వాయిదా వేశారు.

9న రిలీజ్ చేయాల్సిన ఈ మూవీ టీజ‌ర్ ని జ‌న‌వ‌రి 10 ఉద‌యం 10:30 నిమిషాల‌కు రిలీజ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. అందే కాకుండా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైప విష‌యాన్ని వెల్ల‌డించాడు.

టీజ‌ర్ కు చిన్న అంత‌రాయం.. అయితే మీ ఎదురుచూపుల‌కు విలువ‌కు త‌గ్గ రీతిలో టీజ‌ర్ వుంటుంది. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌, అల వైకుంఠ‌పుర‌ములో'అభిమానులు మీకు స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాం' అంటూ కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఓ వీడియోనితో పోస్ట్ పెట్ట‌డం విశేషం.

'విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌' టీమ్ బ్యాంకాక్ లో ప‌ర్య‌టిస్తున్న వీడియో ఇది. టీజ‌ర్ లాస్ట్ సీన్ వ‌ద్దులెండి సార్ నార్మ‌ల్ గానే రిలీజ్ చేద్దామ‌ని కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెబితే..ఆ ఒక్క విష‌యంలో న‌న్ను న‌మ్ము.. అది పండుద్ది.. ప‌క్కా కాన్ఫిడెంట్.. కొన్ని చూడ‌గానే కిక్కొస్తుంది.

టీజ‌ర్ లో ఆ ఎండ్ చూస్తే ఆ కిక్ వ‌స్తుంది. అదేంటో తెలుసు క‌దా మీకూ.. అలా టైటిల్ అయిపోయి టీజ‌ర్ ఎండ్ వ‌ర‌కు అలా చూడండి' అంటూ బ‌న్నీవాస్ చెబుతున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. మ‌రి టీజ‌ర్ లో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌, అల వైకుంఠ‌పుర‌ములో'అభిమానులకు ఆ స‌ర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే మంగ‌ళ‌వారం ఉద‌యం 10:30 గంట‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.